అంబేడ్కర్ కోనసీమ జిల్లా , అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజోలు సీఐ టీ.వి. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో సీఐ కార్యాలయం నుండి అమరవీరుల స్తూపం వరకు సంతాప ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ఈ ప్రాంతానికి చెందిన కోళ్ల వెంకన్న, పిల్లా రవి ప్రసాద్ లకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను శాలువాలు కప్పి సన్మానించారు. సీఐ నరేష్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల భద్రత కోసం కట్టుబడి ఉంటుందని తెలిపారు. పోలీసులు ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించడం గొప్ప త్యాగమని, వారి సేవలను తరతరాలు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి ఎస్సైలు రాజేష్, సురేష్, శ్రీనివాస్ తో పాటు సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


