పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
తేదీ: 11/08/2025 (సోమవారం)
పోలవరం నియోజకవర్గంలోని జనసేన మండల అధ్యక్షులతో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు సోమవారం బర్రింకలపాడు క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ గారు, నియోజకవర్గంలోని అన్ని మండల అధ్యక్షులు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ బలోపేతానికి సంబంధించిన కీలక అంశాలు, ప్రతి మండలంలో జరుగుతున్న పార్టీ కార్యకలాపాల ప్రగతి, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలు విస్తృతంగా చర్చించారు.
ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు మండల అధ్యక్షులకు తమ పరిధిలో పార్టీ విస్తరణకు కృషి చేయాలని, గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు కూటమి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, వృద్ధాప్య పెన్షన్ల పెంపు, రైతులకు సమయానికి నాణ్యమైన విత్తనాల పంపిణీ వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తెచ్చే పనిలో ఉన్నామని తెలిపారు.
అలాగే నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై సమీక్షిస్తూ, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ కృషి చేస్తోందని అన్నారు. ప్రతి మండల అధ్యక్షుడు స్థానిక సమస్యలను క్రమం తప్పకుండా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
సమావేశం చివర్లో మండల అధ్యక్షులు తమ మండలాల్లో ప్రజల నుండి అందిన సమస్యలు, అభ్యర్థనలు వివరించగా, ఎమ్మెల్యే వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు.


