Monday, 23 March 2026
  • Home  
  • పత్తి జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశమైన : కలెక్టర్
- తెలంగాణ

పత్తి జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశమైన : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) జిల్లాలో పత్తి కొనుగోళ్ల పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లాలోని పత్తి జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశమై పత్తి కొనుగోళ్లపై సమీక్షించారు. పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సోమవారం నుండి తలపెట్టిన సమ్మెను జిన్నింగ్ మిల్లుల యజమానులు విరమించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలియజేయడమే కాకుండా అప్పటికప్పుడే రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ సెక్రెటరీ సురేంద్ర మోహన్ తో ఫోన్ ద్వారా మాట్లాడి జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.జిల్లాలోని 23 జిన్నింగ్ మిల్లులకు గాను, ఇప్పటివరకు 19 మిల్లులను ప్రారంభించడం జరిగిందని, తక్కిన నాలుగు జిన్నింగ్ మిల్లులను కూడా సాధ్యమైనంత త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని, అందువల్ల జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సమ్మె కు వెళ్లకుండా మిల్లులు నిర్వహించాలని కోరారు. రాష్ట్ర అసోసియేషన్ తో మాట్లాడిన అనంతరం తగు నిర్ణయం తీసుకుంటామని జిన్నింగ్ మిల్లుల యజమానులు తెలిపారు.

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
జిల్లాలో పత్తి కొనుగోళ్ల పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లాలోని పత్తి జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశమై పత్తి కొనుగోళ్లపై సమీక్షించారు. పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సోమవారం నుండి తలపెట్టిన సమ్మెను జిన్నింగ్ మిల్లుల యజమానులు విరమించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలియజేయడమే కాకుండా అప్పటికప్పుడే రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ సెక్రెటరీ సురేంద్ర మోహన్ తో ఫోన్ ద్వారా మాట్లాడి జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.జిల్లాలోని 23 జిన్నింగ్ మిల్లులకు గాను, ఇప్పటివరకు 19 మిల్లులను ప్రారంభించడం జరిగిందని, తక్కిన నాలుగు జిన్నింగ్ మిల్లులను కూడా సాధ్యమైనంత త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని, అందువల్ల జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సమ్మె కు వెళ్లకుండా మిల్లులు నిర్వహించాలని కోరారు. రాష్ట్ర అసోసియేషన్ తో మాట్లాడిన అనంతరం తగు నిర్ణయం తీసుకుంటామని జిన్నింగ్ మిల్లుల యజమానులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.