Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Anakapalli

నాయకులు అక్రమ అరెస్టులు ఖండిస్తూ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిరసన.

Punnami Newsroom Published:
నాయకులు అక్రమ అరెస్టులు ఖండిస్తూ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిరసన.

Story highlights

  • రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు మాట్లాడుతూ నక్కపల్లిలో అక్టోబర్ 15న జరగనున్న మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణకు వెళుతున్న వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ప్రజల పక్షాన నిర్వాసితులు పక్షాన నిలబడతాం ప్రజల ఓట్లతోటి అధికారం…
  • కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణలను ఎస్.
  • రాయవరం మండలం అడ్డరోడ్డు లో పోలీసులు అరెస్టు చేసి ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు మాట్లాడుతూ నక్కపల్లిలో అక్టోబర్ 15న జరగనున్న మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణకు వెళుతున్న వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ప్రజల పక్షాన నిర్వాసితులు పక్షాన నిలబడతాం ప్రజల ఓట్లతోటి అధికారం వచ్చాక పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకి అండగా ఉండడం చాలా దుర్మార్గమని చర్య ప్రజలే బుద్ధి చెప్తారు అన్నారు సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణలను ఎస్. రాయవరం మండలం అడ్డరోడ్డు లో పోలీసులు అరెస్టు చేసి ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈరోజు తెల్లవారి నుంచి సిపిఎం రాయవరం మండల కార్యదర్శి ఎం సత్యనారాయణ, నక్కపల్లి మండల కార్యదర్శి ఎం రాజేష్, రాజయ్యపేట సిపిఎం శాఖ కార్యదర్శి మైలపల్లి మహేష్ బాబులను గృహ నిర్బంధించడాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి రైతు సంఘం జిల్లా కార్యదర్శి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. అప్పలరాజును 3 రోజులుగా గృహనిర్బంధంలో ప్రజాస్వామిక చర్య. అరెస్టు చేసిన వారిని, గృహనిర్బంధంలో ఉన్న వారిని భేషరతుగా విడుదల చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి . ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డేడ రామ్ కుమార్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కాండ్రేగుల రామసదాశివ, ఎస్ కన్నుం నాయుడు బి రాము తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *