Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Anakapalli

స్థానిక ఎన్నికల వేళ పోలీసుల నిఘా.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!

Punnami Newsroom Published:
స్థానిక ఎన్నికల వేళ పోలీసుల నిఘా.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!

Story highlights

  • జిల్లాలో త్వరలో జరగనున్న పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ స్పష్టం చేశారు.
  • ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గురువారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
  • జిల్లాలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, గత ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లపై బైండోవర్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జిల్లాలో త్వరలో జరగనున్న పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గురువారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, గత ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లపై బైండోవర్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్‌ నాన్‌ బెయిలబుల్‌ వారంట్లను అమలు చేయడంతో పాటు లైసెన్స్‌ ఆయుధాలను పోలీస్‌ స్టేషన్లలో డిపాజిట్‌ చేయించాలని సూచించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా తనిఖీలు విస్తృతం చేసి, పోలీసుల గస్తీని పెంచాలన్నారు.
సభలు, ర్యాలీలు, రోడ్‌షోలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని, ప్రచార వాహనాలకు అనుమతి పాస్‌ ఉండాలని స్పష్టం చేశారు. మద్యం, నగదు, బహుమతులతో ఓటర్లను ప్రలోభపెట్టడం, సోషల్‌ మీడియాలో కులమత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేలకుపైగా నగదు తరలిస్తే తనిఖీల్లో స్వాధీనం చేసుకునే అవకాశం ఉందన్నారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా బాధ్యులపై చట్టప్రకారం నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఓటర్లు ఎలాంటి భయాలు, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, నగదు, మద్యం పంపిణీ, ఓటర్ల బెదిరింపులపై ప్రజలు 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *