Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Anakapalli

ప్రకృతి వ్యవసాయంతోనే తక్కువ ఖర్చు, ఎక్కువ దిగుబడి..

Punnami Newsroom Published:
ప్రకృతి వ్యవసాయంతోనే తక్కువ ఖర్చు, ఎక్కువ దిగుబడి..

Story highlights

  • ఎలమంచిలి మండలం కృష్ణాపురం గ్రామంలో బయో రిసోర్స్ సెంటర్స్ (BRC) పై రైతులకు అవగాహన ర్యాలీ, రైతులతో సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఎన్‌ఎఫ్‌ఏ జ్యోతిర్మయి మాట్లాడుతూ..
  • రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించాలని సూచించారు.

ఎలమంచిలి మండలం కృష్ణాపురం గ్రామంలో బయో రిసోర్స్ సెంటర్స్ (BRC) పై రైతులకు అవగాహన ర్యాలీ, రైతులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్‌ఎఫ్‌ఏ జ్యోతిర్మయి మాట్లాడుతూ.. రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను వినియోగించాలని, భూమిని ఖాళీగా ఉంచకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని తెలిపారు.
వాతావరణ అసమతుల్యత కారణంగా ప్రస్తుతం పంటలు ఎర్రగా మారి, తెగుళ్లు, పురుగుల ఉధృతి ఎక్కువగా ఉందని, వీటి నివారణకు రసాయనాల జోలికి పోకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సిద్ధం చేసే కషాయాలు, ద్రావణాలు, గ్రోత్ ప్రమోటర్లను మాత్రమే పిచికారీ చేసుకుని తక్కువ ఖర్చుతో పంటలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని వివరించారు.
డెమో రూపంలో రైతులకు అన్ని కషాయాలు, ద్రావణాలను చూపించి, ఏ కషాయం ఏ తెగులు, పురుగుకు పనిచేస్తుందో తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయం అమలవుతున్న గ్రామాల్లోని BRC కేంద్రాల వద్ద అందుబాటులో ఉండే కషాయాలు, ద్రావణాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *