Friday, 6 February 2026
  • Home  
  • నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ ( Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపులు * జీవీఎంసీ పరిధిలో 336 ఆక్రమణల తొలగింపు .
- విశాఖపట్నం

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ ( Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపులు * జీవీఎంసీ పరిధిలో 336 ఆక్రమణల తొలగింపు .

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ ( Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపులు * జీవీఎంసీ పరిధిలో 336 ఆక్రమణల తొలగింపు . – జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ . ప్రభాకర్ రావు *విశాఖపట్నం డిసెంబర్ 13పున్నమి ప్రతినిధి* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ల లో ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా 336 ఆక్రమణలను తొలగించడం జరిగిందని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ . ప్రభాకర్ రావు శనివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు సురక్షితంగా ఫుట్ పాతులపై నడక సాగించేందుకు, రోడ్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసమై జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ (Operation Lungs) 2.0 లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై జంక్షన్లలో ఆక్రమణలు తొలగించడమైనదని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. ప్రజా సౌకర్యార్థమై ఆక్రమణల తొలగింపు కొనసాగిస్తూ ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరిగినదని, ఇప్పటికే నగరంలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా రక్షణ చర్యల దిశగా ఆపరేషన్ లంగ్స్ పనిచేస్తుందన్నారు. మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమంలో ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులులో ఎక్కువగా రోడ్లు, పుట్ పాత్ ఆక్రమణలు మరియు రోడ్ల కిరువైపుల వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల రోడ్లకు అండంకు ఏర్పడడం, తరచుగా ప్రజల రాకపోకలకు, వాహనాల రవాణాకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి తక్షణ చర్యలు చేపట్టే ఆవశ్యకత దృష్ట్యా జి.వి.యం.సి లో గల 8 జోన్ల పరిధిలో గల ప్రధాన రహదారులలో, జంక్షన్లలో ఉన్న ఆక్రమణలు గుర్తించి వాటిని వెంటనే పోలీసు వారి సహకారము తో తొలగించడమైనదని సిసిపి తెలిపారు. తొలగించిన ఆక్రమణలను ఈ క్రింద పొందుపరచడమైనది. 1వ జోన్ లోని వార్డు నెంబర్ 1 లో అంబేద్కర్ విగ్రహం నుండి తగరపువలస వైయస్సార్ ఎకరం వరకు 15 ఆక్రమణలు, జోన్ 2 లో 5 , 7 వార్డులలో-మారికవలస జంక్షన్ నుండి బోయపాలెం రోడ్డు వరకు, చంద్రంపాలెం నుండి హైస్కూల్ వరకు 40 ఆక్రమణలు, 3వ జోన్ 18 వార్డు పరిధిలో సమతా కాలేజీ సర్కిల్, ఏఎస్ రాజా కాలేజీ సర్కిల్ 23 ఆక్రమణలు, 4 వ జోన్ 31 వార్డు పరిధిలోని లీలామహల్ జంక్షన్ నుండి సౌత్ జైలు రోడ్డు వరకు 31 ఆక్రమణలు, 5వ జోన్ లో 54, 55, 56 ,57 వార్డుల పరిధిలోని కంచరపాలెం నుండి ఎన్ఏడి జంక్షన్ వరకు 80 ఆక్రమణలు, 6వ జోన్ 65, 66, 71, 72, 75, 76 వార్డుల పరిధిలోని శ్రీనగర్ నుండి దుర్గా నగర్ రోడ్డు, బీసీ రోడ్డు జంక్షన్ నుండి గంగవరం పోర్టు రోడ్డు వరకు 70 ఆక్రమణలను, 7వ జోన్ 82, 83 వార్డుల పరిధిలో నెహ్రూ చౌక్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు 12 ఆక్రమణలు, 8వ జోన్ 97 వార్డు పరిధిలోని సుజాతనగర్ 80 ఫీట్ రోడ్డు నుండి ఎలక్ట్రికల్ ఆఫీస్ వరకు 30 ఆక్రమణలను తొలగించడం జరిగిందని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా జోన్ల కమిషనర్లు ,సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది , పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ ( Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపులు

* జీవీఎంసీ పరిధిలో 336 ఆక్రమణల తొలగింపు .

– జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ . ప్రభాకర్ రావు

*విశాఖపట్నం డిసెంబర్ 13పున్నమి ప్రతినిధి* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ల లో ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా 336 ఆక్రమణలను తొలగించడం జరిగిందని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ . ప్రభాకర్ రావు శనివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు సురక్షితంగా ఫుట్ పాతులపై నడక సాగించేందుకు, రోడ్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసమై జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ (Operation Lungs) 2.0 లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై జంక్షన్లలో ఆక్రమణలు తొలగించడమైనదని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. ప్రజా సౌకర్యార్థమై ఆక్రమణల తొలగింపు కొనసాగిస్తూ ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరిగినదని, ఇప్పటికే నగరంలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా రక్షణ చర్యల దిశగా ఆపరేషన్ లంగ్స్ పనిచేస్తుందన్నారు.

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమంలో ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులులో ఎక్కువగా రోడ్లు, పుట్ పాత్ ఆక్రమణలు మరియు రోడ్ల కిరువైపుల వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల రోడ్లకు అండంకు ఏర్పడడం, తరచుగా ప్రజల రాకపోకలకు, వాహనాల రవాణాకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి తక్షణ చర్యలు చేపట్టే ఆవశ్యకత దృష్ట్యా జి.వి.యం.సి లో గల 8 జోన్ల పరిధిలో గల ప్రధాన రహదారులలో, జంక్షన్లలో ఉన్న ఆక్రమణలు గుర్తించి వాటిని వెంటనే పోలీసు వారి సహకారము తో తొలగించడమైనదని సిసిపి తెలిపారు.

తొలగించిన ఆక్రమణలను ఈ క్రింద పొందుపరచడమైనది.

1వ జోన్ లోని వార్డు నెంబర్ 1 లో అంబేద్కర్ విగ్రహం నుండి తగరపువలస వైయస్సార్ ఎకరం వరకు 15 ఆక్రమణలు,

జోన్ 2 లో 5 , 7 వార్డులలో-మారికవలస జంక్షన్ నుండి బోయపాలెం రోడ్డు వరకు, చంద్రంపాలెం నుండి హైస్కూల్ వరకు 40 ఆక్రమణలు,

3వ జోన్ 18 వార్డు పరిధిలో సమతా కాలేజీ సర్కిల్, ఏఎస్ రాజా కాలేజీ సర్కిల్ 23 ఆక్రమణలు,

4 వ జోన్ 31 వార్డు పరిధిలోని లీలామహల్ జంక్షన్ నుండి సౌత్ జైలు రోడ్డు వరకు 31 ఆక్రమణలు,

5వ జోన్ లో 54, 55, 56 ,57 వార్డుల పరిధిలోని కంచరపాలెం నుండి ఎన్ఏడి జంక్షన్ వరకు 80 ఆక్రమణలు,

6వ జోన్ 65, 66, 71, 72, 75, 76 వార్డుల పరిధిలోని శ్రీనగర్ నుండి దుర్గా నగర్ రోడ్డు, బీసీ రోడ్డు జంక్షన్ నుండి గంగవరం పోర్టు రోడ్డు వరకు 70 ఆక్రమణలను,

7వ జోన్ 82, 83 వార్డుల పరిధిలో నెహ్రూ చౌక్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు 12 ఆక్రమణలు,

8వ జోన్ 97 వార్డు పరిధిలోని సుజాతనగర్ 80 ఫీట్ రోడ్డు నుండి ఎలక్ట్రికల్ ఆఫీస్ వరకు 30 ఆక్రమణలను తొలగించడం జరిగిందని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆయా జోన్ల కమిషనర్లు ,సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది , పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.