Monday, 23 March 2026
  • Home  
  • నకిరేకల్ పట్టణంలో బోనాల పండుగ సంబరాలు
- తెలంగాణ

నకిరేకల్ పట్టణంలో బోనాల పండుగ సంబరాలు

నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నకిరేకల్ పట్టణంలోని ముత్యాలమ్మకు గురువారం (14ఆగస్ట్ 2025) నాడు బోనాలు ఇవ్వడం (సమర్పించడం ) జరిగింది. పట్టణంలోని భక్తులు ఆలయంకు ఉదయం నుండే అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. బోనాల పండుగను తెలంగాణా ప్రజలు ఆషాడ మాసం, శ్రావణమాసంలలో జరుపుకుంటారు. బోనం అర్ధం భోజనం, ఎల్లమ్మ దేవతను ప్రత్యక్షంగా పూజిస్తారు. పాలు, బెల్లం, అన్నంతో తయారుచేసిన నైవేద్యాన్ని మట్టి లేదా రాగికుండలతో తలపై పెట్టుకొని ఆకుండను పసుపు, కుంకుమ, వేపరిమ్మలతో, తెల్లముగ్గుతో అలంకరిస్తారు. ఆకుండపై ఒక దీపం ఉంచుతారు. పూర్వకాలంలో దుష్టశక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దానికి బదులుగా కోళ్లు, గొర్రెలు బలి ఇస్తున్నారు. బోనాలు మోస్తున్న మహిళలను అమ్మవారు అవహిస్తారని భక్తుల విశ్వాసం, డప్పుమోతలుతో ఊరేగింపుగా మహిళలు బోనమెత్తుకొని అమ్మవారి గుడికి వచ్చి బోనం సమర్పిస్తారు.ఈపండుగలో అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిభింభించే వేషాలు వేసుకొని, చేతిలో కొరడాతో, ఒంటినిండా పసుపు కుంకుమ, కాళ్లకు గజ్జెలు కట్టుకొని, ఎర్రని గోఛీ ధరించి డప్పుల మోతకు అనుగుణంగా లయబద్ధంగా ఆడుతారు. ముత్యాలమ్మ ఆలయంకు ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )

నకిరేకల్ పట్టణంలోని ముత్యాలమ్మకు గురువారం (14ఆగస్ట్ 2025) నాడు బోనాలు ఇవ్వడం (సమర్పించడం ) జరిగింది. పట్టణంలోని భక్తులు ఆలయంకు ఉదయం నుండే అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది.
బోనాల పండుగను తెలంగాణా ప్రజలు ఆషాడ మాసం, శ్రావణమాసంలలో జరుపుకుంటారు. బోనం అర్ధం భోజనం, ఎల్లమ్మ దేవతను ప్రత్యక్షంగా పూజిస్తారు. పాలు, బెల్లం, అన్నంతో తయారుచేసిన నైవేద్యాన్ని మట్టి లేదా రాగికుండలతో తలపై పెట్టుకొని ఆకుండను పసుపు, కుంకుమ, వేపరిమ్మలతో, తెల్లముగ్గుతో అలంకరిస్తారు. ఆకుండపై ఒక దీపం ఉంచుతారు.
పూర్వకాలంలో దుష్టశక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దానికి బదులుగా కోళ్లు, గొర్రెలు బలి ఇస్తున్నారు.
బోనాలు మోస్తున్న మహిళలను అమ్మవారు అవహిస్తారని భక్తుల విశ్వాసం, డప్పుమోతలుతో ఊరేగింపుగా మహిళలు బోనమెత్తుకొని అమ్మవారి గుడికి వచ్చి బోనం సమర్పిస్తారు.ఈపండుగలో అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిభింభించే వేషాలు వేసుకొని, చేతిలో కొరడాతో, ఒంటినిండా పసుపు కుంకుమ, కాళ్లకు గజ్జెలు కట్టుకొని, ఎర్రని గోఛీ ధరించి డప్పుల మోతకు అనుగుణంగా లయబద్ధంగా ఆడుతారు.
ముత్యాలమ్మ ఆలయంకు ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.