ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఈనెల 23న సికింద్రాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న సింవపురి ఎక్స్ ప్రెస్ లో దొంగతనం కేసులో ఓ పోలీస్ కానిస్టేబుల్ తో పాటు అతని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం న్యాయస్థానానికి తరలించారు.
GRP ఖమ్మం సర్కిల్ ఇన్స్పెక్టర్ N అంజలి కథనం ప్రకారం… హైదరాబాద్ మణికొండ కు చెందిన బండి ప్రియాంక సింహపురి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తోంది. తన I – ఫోన్ -15 దొంగలించబడినట్లు గుర్తించింది. ఇద్దరు అగంతకులను అనుమానించింది. ఈ మేరకు డోర్నకల్ GRP పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న డోర్నకల్ పోలీసులు ఖమ్మం CI N.అంజలి ఆధ్వర్యంలో SI J.సురేష్ దర్యాప్తు ప్రారంభించారు.
ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారు నేరాన్ని ఒప్పుకున్నారు.
రాచకొండ కమిషనరేట్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న యరమడి రవీందర్ జల్సాలకు అలవాటు పడ్డాడు. GRP సికింద్రాబాద్ లో కొంతకాలం విధులు నిర్వహించిన రవీందర్ రైల్లో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే తన బావ మరిది మేకల నాగసాయి తో కలిసి రైళ్లలో దొంగతనాలు చేస్తున్నాడు.
బండి ప్రియాంక ఫిర్యాదుతో నిందితులు ఇద్దరు ఇలా పోలీసులకు చిక్కారు.

