Thursday, 5 February 2026
  • Home  
  • తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన!
- తెలంగాణ - సినిమా - హైదరాబాద్

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన!

*తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన!* హైదరాబాద్, ఆగస్టు 04, పున్నమి ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలను స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు కో-ఛైర్మన్‌ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌ ను నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌ గా సంజీవ్ గోయెంకా ను కో-ఛైర్మన్‌ గా ఉపాసన కొణిదెల నియమించారు. అపోలో హాస్పిటల్స్‌ లో CSR వైస్ ఛైర్‌ పర్సన్ , UR లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌ గా ఆరోగ్యం, ఫిట్‌నెస్, యువతకు సంబంధించిన కార్యక్రమాలలో ఉపాసన పేరు తెచ్చుకున్నారు. ఆమె నాయకత్వం క్రీడాకారుల సంక్షేమం , క్రీడా విద్యపై దృష్టి సారిస్తుందని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది. ఈ పాలసీ ద్వారా తెలంగాణ క్రీడా రంగాన్ని రాజకీయ ప్రభావం నుండి దూరంగా ఉంచి, ప్రైవేట్ సంస్థలు, నిపుణులతో భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

*తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన!*

హైదరాబాద్, ఆగస్టు 04, పున్నమి ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలను స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు కో-ఛైర్మన్‌ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది.

తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌ ను నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌ గా సంజీవ్ గోయెంకా ను కో-ఛైర్మన్‌ గా ఉపాసన కొణిదెల నియమించారు.

అపోలో హాస్పిటల్స్‌ లో CSR వైస్ ఛైర్‌ పర్సన్ , UR లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌ గా ఆరోగ్యం, ఫిట్‌నెస్, యువతకు సంబంధించిన కార్యక్రమాలలో ఉపాసన పేరు తెచ్చుకున్నారు. ఆమె నాయకత్వం క్రీడాకారుల సంక్షేమం , క్రీడా విద్యపై దృష్టి సారిస్తుందని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది. ఈ పాలసీ ద్వారా తెలంగాణ క్రీడా రంగాన్ని రాజకీయ ప్రభావం నుండి దూరంగా ఉంచి, ప్రైవేట్ సంస్థలు, నిపుణులతో భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.