Tuesday, 24 March 2026
  • Home  
  • తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- తెలంగాణ

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

సర్పంచ్​ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌(Telangana Local Elections Schedule)ను విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు పేర్కొంది. మొదటి విడత పోలింగ్ వచ్చేనెల​11న, రెండో విడత 14న, మూడో విడత 17న జరుగనుంది. ఓటింగ్​జరిగిన రోజునే ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్ రావడంతో ఇవాళ్టి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. 31 జిల్లాల్లోని 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు సైతం ఖరారు అయ్యాయి. కాగా, రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. పోలింగ్ జరిగిన రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగనుంది. డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికలు, డిసెంబర్ 14న రెండో విడుత ఎన్నికలు, డిసెంబర్ 17న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 27వ తేదీ నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. 30వ తేదీ నుంచి రెండో దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 3వ తేదీ నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. రాష్ట్రంలో కోటి 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారిణి రాణి కుముదిని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన

సర్పంచ్​ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌(Telangana Local Elections Schedule)ను విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు పేర్కొంది. మొదటి విడత పోలింగ్ వచ్చేనెల​11న, రెండో విడత 14న, మూడో విడత 17న జరుగనుంది. ఓటింగ్​జరిగిన రోజునే ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్ రావడంతో ఇవాళ్టి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. 31 జిల్లాల్లోని 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు సైతం ఖరారు అయ్యాయి. కాగా, రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. పోలింగ్ జరిగిన రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగనుంది. డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికలు, డిసెంబర్ 14న రెండో విడుత ఎన్నికలు, డిసెంబర్ 17న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 27వ తేదీ నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. 30వ తేదీ నుంచి రెండో దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 3వ తేదీ నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. రాష్ట్రంలో కోటి 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారిణి రాణి కుముదిని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.