Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Mahabubabad

డోర్నకల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీ మాలోత్ కవిత

Punnami Newsroom Published:
డోర్నకల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీ మాలోత్ కవిత

*తేదీ 28.10.2026*
*డోర్నకల్*

*నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో* ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా
*భారాస_పార్టీ_జిల్లా_అధ్యక్షులు*డోర్నకల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీ మాలోత్ కవిత.

ఈ సందర్భంగా మండలంలోని ముఖ్య నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొని పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల పరిధిలోని గ్రామాల వారీగా ఓటరు నమోదు పరిస్థితిని సమీక్షించారు. గ్రామ స్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశమై, ఇప్పటివరకు ఎన్ని ఓట్లు నమోదు అయ్యాయి, ఇంకా ఎంతమంది అర్హులైన పట్టభద్రులు నమోదు చేసుకోవాల్సి ఉంది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో ఓటరు నమోదు పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నమోదు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చూడాలని సూచించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు అత్యంత కీలకమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని, ఇంకా నమోదు చేసుకోని అర్హులైన వారందరూ తమ పేర్లను నమోదు చేసుకునేలా చొరవ తీసుకోవాలని తెలిపారు.

అదేవిధంగా, ఓటరు నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, ప్రతి గ్రామంలో బూత్ లెవల్ ఏజెంట్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నమోదు ప్రక్రియలో వెనుకబడిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, అర్హులైన పట్టభద్రులందరి నమోదు పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

రానున్న నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు సవాలుగా తీసుకుని పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

పార్టీ శ్రేణులందరూ సమష్టిగా కృషి చేస్తూ, క్షేత్రస్థాయిలో పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు, ఎన్నికల సన్నాహాల్లో ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా పాల్గొని పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

డోర్నకల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీ మాలోత్ కవిత

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *