డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు నగర మేయర్ ఘన నివాళి.
*విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- సమాజంలో అన్ని వర్గాలకు సమానత్వం కల్పించేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఎంతో కృషి చేశారని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వారి జీవితాలలో వెలిగి నింపిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఈ పుడమి ఉన్నంతవరకు ప్రజల గుండెల్లో చిరస్మనీయునిగా ఉంటారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా భారత దేశ రాజ్యాంగాన్ని రచనలో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని మేయర్ తెలిపారు.
ఈ కార్యక్రమం లో జివిఎంసి సూపరింటెండెంట్ లు రియాజ్ ,శ్రీనివాస్ , ఉద్యోగులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


