Wednesday, 25 March 2026
  • Home  
  • “ట్రంప్ అడుగులకు మడుగు లొత్తే మోడీ లొంగుబాటు విధానంపై పోరాడదాం” – ఎస్ఎఫ్ఐ
- ఎన్ టి ఆర్ జిల్లా

“ట్రంప్ అడుగులకు మడుగు లొత్తే మోడీ లొంగుబాటు విధానంపై పోరాడదాం” – ఎస్ఎఫ్ఐ

కంచికచర్ల మండలంలోని ఎన్టీఆర్ జూనియర్ మరియు కె.వి.పారామెడికల్ కళాశాలల్లో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో అమెరికా టారీఫ్ సుంకాలపై జరిగిన సదస్సులో మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎస్ఎఫ్ఐ నాయకులు కోట కళ్యాణ్ మరియు గోపి నాయక్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారం భించిన వాణిజ్య యుద్ధం భారతదేశంతో సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తోందని, ముఖ్యంగా భారత వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు సంక్షోభంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. టెక్స్టైల్, గార్మెంట్, పట్టు రంగాలు నష్టపోతుండడంతో కార్మికులు, రైతులు, విద్యార్థులు కష్టాల్లో పడుతున్నారని తెలిపారు. వారు మోడీ ప్రభుత్వం”అమెరికా ప్రయోజ నాలకు లొంగిపోయినది” అని విమర్శిస్తూ, స్వతంత్ర విదేశాంగ విధానానికి తూట్లు పొడుస్తోం దని అన్నారు. అమెరికా సామ్రా జ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు ఉద్యమిం చాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గోపి నాయక్ మాట్లాడుతూ – ట్రంప్ విధానాల వల్ల భారత వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతాయని, రైతులుదివాలా తీయాల్సి వస్తుందని హెచ్చరించారు.మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోకుండా అమెరికాతో ఒప్పందాలు కుదురుస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజ నాలు కాపాడాల్సిన బాధ్యత ఉన్నా, టిడిపి మరియు వైసీపీ ప్రభుత్వాలు మౌనం వహిస్తు న్నాయని అన్నారు. ఈ సదస్సు లో దీపిక, వరలక్ష్మి, తులసి, ప్రేమ్ కుమార్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

కంచికచర్ల మండలంలోని ఎన్టీఆర్ జూనియర్ మరియు కె.వి.పారామెడికల్ కళాశాలల్లో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో అమెరికా టారీఫ్ సుంకాలపై జరిగిన సదస్సులో మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎస్ఎఫ్ఐ నాయకులు కోట కళ్యాణ్ మరియు గోపి నాయక్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారం భించిన వాణిజ్య యుద్ధం భారతదేశంతో సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తోందని, ముఖ్యంగా భారత వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు సంక్షోభంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు.
టెక్స్టైల్, గార్మెంట్, పట్టు రంగాలు నష్టపోతుండడంతో కార్మికులు, రైతులు, విద్యార్థులు కష్టాల్లో పడుతున్నారని తెలిపారు. వారు మోడీ ప్రభుత్వం”అమెరికా ప్రయోజ నాలకు లొంగిపోయినది” అని విమర్శిస్తూ, స్వతంత్ర విదేశాంగ విధానానికి తూట్లు పొడుస్తోం దని అన్నారు. అమెరికా సామ్రా జ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు ఉద్యమిం చాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
గోపి నాయక్ మాట్లాడుతూ –
ట్రంప్ విధానాల వల్ల భారత వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతాయని, రైతులుదివాలా తీయాల్సి వస్తుందని హెచ్చరించారు.మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోకుండా అమెరికాతో ఒప్పందాలు కుదురుస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజ నాలు కాపాడాల్సిన బాధ్యత ఉన్నా, టిడిపి మరియు వైసీపీ ప్రభుత్వాలు మౌనం వహిస్తు న్నాయని అన్నారు. ఈ సదస్సు లో దీపిక, వరలక్ష్మి, తులసి, ప్రేమ్ కుమార్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.