రంగారెడ్డి జిల్లా ( పున్నమి ప్రతినిధి అక్టోబర్ 24 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.ఉపఎన్నిక నేపథ్యంలో సోమాజిగూడ డివిజన్ పరిధిలోని 294, 295, 296 బూత్‌లలో నిర్వహించిన గడపగడప ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ప్రజలతో కరచాలనం చేస్తూ, మాగంటి సునీత అభ్యర్థికి ఓటు వేయాలని, జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
జూబ్లీహిల్స్ ప్రజలలో మాగంటి సునీత గోపీనాథ్ పట్ల గట్టి విశ్వాసం నెలకొంది. అభివృద్ధి, సంక్షేమం, శాంతి స్థిరత్వం కోరుకునే ప్రతి ఒక్కరు కేసీఆర్ పరిపాలననే తిరిగి రావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి, అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే ప్రజలు విసిగిపోయారు. అభివృద్ధి నిలిచిపోయింది, ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. అదే కారణంగా జూబ్లీహిల్స్ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పట్ల ఆకర్షితులవుతున్నారు,అని ఆమె పేర్కొన్నారు.
అలాగే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ
ప్రజలు ఎవరినీ అడిగినా ఒకే మాట చెబుతున్నారు – కారు గుర్తుకే ఓటేస్తాం… మాగంటి సునీత గోపీనాథ్ నే గెలిపిస్తాం. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందించి జూబ్లీహిల్స్ నుండి అభివృద్ధి యాత్రను మళ్లీ ప్రారంభించాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా నేతలు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత గెలుపు ఖాయం : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి జిల్లా ( పున్నమి ప్రతినిధి అక్టోబర్ 24 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.ఉపఎన్నిక నేపథ్యంలో సోమాజిగూడ డివిజన్ పరిధిలోని 294, 295, 296 బూత్‌లలో నిర్వహించిన గడపగడప ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ప్రజలతో కరచాలనం చేస్తూ, మాగంటి సునీత అభ్యర్థికి ఓటు వేయాలని, జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలలో మాగంటి సునీత గోపీనాథ్ పట్ల గట్టి విశ్వాసం నెలకొంది. అభివృద్ధి, సంక్షేమం, శాంతి స్థిరత్వం కోరుకునే ప్రతి ఒక్కరు కేసీఆర్ పరిపాలననే తిరిగి రావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి, అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే ప్రజలు విసిగిపోయారు. అభివృద్ధి నిలిచిపోయింది, ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. అదే కారణంగా జూబ్లీహిల్స్ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పట్ల ఆకర్షితులవుతున్నారు,అని ఆమె పేర్కొన్నారు. అలాగే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎవరినీ అడిగినా ఒకే మాట చెబుతున్నారు – కారు గుర్తుకే ఓటేస్తాం… మాగంటి సునీత గోపీనాథ్ నే గెలిపిస్తాం. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందించి జూబ్లీహిల్స్ నుండి అభివృద్ధి యాత్రను మళ్లీ ప్రారంభించాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా నేతలు పాల్గొన్నారు.

