చీపురుపల్లి, అక్టోబర్ 18:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో రాష్ట్ర వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కమిటీ సభ్యులు, విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) పాల్గొన్నారు.
చీపురుపల్లి అసెంబ్లీ పరిధిలోని చీపురుపల్లి మేజర్ పంచాయతీ రుంకాన వీధిలో జరిగిన ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ యువజన అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు గిరిడి రామదాసు, కోసిరెడ్డి రమణ, ముల్లు పైడిరాజు, వార్డు సభ్యులు కర్ణపు ఆదినారాయణ, మీసాల సాయి, బురాడ మహేష్, తలసీట్ల రాము తదితరులు పాల్గొన్నారు.
అలాగే పార్టీ నాయకులు ఇజ్జురోజు రమణ, అప్పలనాయుడు, మాస్టర్, మాజీ ఏఎంసీ వైస్ ఛైర్మన్ సతివాడ అప్పారావు, సతివాడ అదికృష్ణ, దబ్బాడ జగదీష్, మీసాల గౌరీ, రుంకాన రాజేష్, శాంతారావు తదితర కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్యం హక్కు, వ్యాపారం కాదు. వైద్య విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తుంది” అని తెలిపారు.


