పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్15)
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి మండల కేంద్రంలో గల మెయిన్ రోడ్ లో చిన్న పాటి వర్షానికే చెరువుని తలపిస్తున్నట్లుగా తయారయింది అని వైసీపీ జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ అన్నారు. మండలం లో ఇదే పరిస్థితి లో ఉందని అన్నారు. గతంలో ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదన్నారు. అంతకన్నా ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో గోతులన్న నాయకులు ఇప్పుడు ఏమయ్యారు. అదేవిధంగా స్థానిక నాయకులు కూడా పట్టించుకోవడం లేదు,జిల్లా కలెక్టర్ , స్థానిక ఎమ్మెల్యే స్పందించి కనీసం గుంతలు పూడ్చే ఏర్పాటు చేయాలని మండల ప్రజల తరపున కోరుతున్నాము.


