చిట్వేల్, అక్టోబర్ 28: పున్నమి ప్రతినిధి
మోన్ధా తుఫాన్ ప్రభావంతో మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని అధికారులు పరిశీలించారు.మండల తహసీల్దార్ స్పందన రెడ్డి తన సిబ్బందితో కలిసి పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులను సమీక్షించారు. ప్రజలకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు, ఆహారం, నీరు, విద్యుత్, మరియు వైద్య సదుపాయాల లభ్యతను పరిశీలించారు.ఆరోగ్య శాఖ తరఫున హెల్త్ సూపర్వైజర్ ఇస్మాయిల్ తన సిబ్బందితో కలిసి వివిధ రకాల సాధారణ ఆరోగ్య సమస్యలకు అవసరమైన మందులతో హాజరయ్యారు.మండల విద్యాశాఖ అధికారులు ఖాజా హుస్సేన్, ఈశ్వరయ్యలు కూడా ఏర్పాట్లను పరిశీలించి, విద్యార్థులు మరియు ప్రజలకు సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా సూచనలు ఇచ్చారు.అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటకృష్ణ తన బృందంతో కలిసి పునరావాస కేంద్రంలోని తాగునీటి నాణ్యతను పరిశీలించారు.తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని, అవసరమైతే కంట్రోల్ రూమ్ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు.ఈ పరిశీలనలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఎన్సీసీ అధికారి పసుపుల రాజశేఖర్, ఉపాధ్యాయులు హరినాథ్, చెన్నయ్య, కాలేశా, సుహాసిని, సతీష్, ప్రసన్న, కిరణ్ తదితరులు, విద్యాశాఖ, రెవెన్యూ, సచివాలయ మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు


