అల్లూరి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి నవంబర్ 07:
భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆవిర్భవించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా, గీత రచయిత బంకిం చంద్ర ఛటర్జీ ని స్మరించుకుంటూ అల్లూరి జిల్లా, చింతపల్లి మండలం, తాజంగి గ్రామం పరిధిలో ఘనంగా వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి దేశభక్తిని చాటుతూ వందేమాతరం గీతాన్ని భక్తిశ్రద్ధలతో ఆలపించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారిలో
పాఠశాల ఉపాధ్యాయులు,విద్య కమిటీ చైర్మన్ శెట్టి మోహనరావు,కూటమి నాయకులు బోనంగి బాలయ్య పాడాల్,బోనంగి లింగమూర్తి,మొస్య నారాయణ రావు ఉన్నారు.వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి అందించిన స్ఫూర్తిని, బంకిం చంద్ర ఛటర్జీ సాహిత్య సేవలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. విద్యార్థులు, నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులందరూ కలిసి దేశభక్తిని ప్రదర్శిస్తూ ఈ చారిత్రక వేడుకను విజయవంతం చేశారు.


