అరకులోయ( పున్నమి ప్రతినిధి), నవంబర్ 15 అరకులోయ మండల పరిషత్ కార్యాలయంలో జన జాతీయ గౌరవ్ దివాస్ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎంపీడీవో లవరాజు, సిబ్బంది, వైసిపి నాయకులు భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా సేవలను, త్యాగాల గురించి ఎంపీడీవో వివరించారు. జల్, జంగిల్, జమీన్ పై పూర్తి హక్కు ఆదివాసీలదే అని బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిర్సా ముండా పోరాడారని పేర్కొన్నారు. బస్కీ పంచాయతీ సర్పంచ్ పాడి రమేష్, వైసీపీ నాయకులు కమ్మిడి అశోక్, గరం పూర్ణచంధర్, ఏవో ఉదయ భాస్కర్, ఉపాధి హామీ సిబ్బంది జగదీష్, తదితరులు ఉన్నారు.

ఘనంగా జన జాతీయ గౌరవ్ దివాస్