Friday, 6 February 2026
  • Home  
  • ఘనంగా కామ్రేడ్ వంకా వర్ధంతి
- కాకినాడ

ఘనంగా కామ్రేడ్ వంకా వర్ధంతి

రమణయ్యపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, కామ్రేడ్ వంకా సత్యనారాయణ ఏడో వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ వంకా పెద్ద మనుమడు డా అడ్డాల, జానకి రమ, సత్య సాహితీ చే మహిళలకు దుప్పట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ కమ్యూనిజం భావజాలంతో మన భారతదేశంలో తొలిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీ భారతీయ కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. మహిళలకు సామాజిక సమానత్వం, భూసంస్కరణలు, అట్టడుగు కులాలకు సామాజిక న్యాయం అనే అంశాలపై పోరాడిన కమ్యూనిస్టు పార్టీలో పెనుగొండ శాసనసభ్యుడిగా మూడుసార్లు పనిచేసిన వంకా సత్యనారాయణ తన 19వ ఏట పార్టీలో చేరారన్నారు.93వ ఏట కాలం చేశారన్నారు. కమ్యూనిస్టు పార్టీలో చేరిన నాటి నుండి తుది శ్వాస విడిచే వరకు పార్టీ అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషి చేశారన్నారు.ఆయన చూపిన బాట లొ పయనిస్తూ ఆయన మనుమడు డా అడ్డాల సత్యనారాయణ నిరంతరం ప్రజా సేవలో ఉండటం అభినంద నీయమని అన్నారు. ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ “వంక సత్యనారాయణ పెద్ద మనవడునైన తాను ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు.అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, అడబాల రత్న ప్రసాద్, బుద్ధరాజు సత్యనారాయణ రాజు,ఎస్.శ్రీ నగేష్, మంచెం సుబ్రహ్మణ్యేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

రమణయ్యపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, కామ్రేడ్ వంకా సత్యనారాయణ ఏడో వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ వంకా పెద్ద మనుమడు డా అడ్డాల, జానకి రమ, సత్య సాహితీ చే మహిళలకు దుప్పట్లు పంచి పెట్టారు.
ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ కమ్యూనిజం భావజాలంతో మన భారతదేశంలో తొలిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీ భారతీయ కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. మహిళలకు సామాజిక సమానత్వం, భూసంస్కరణలు, అట్టడుగు కులాలకు సామాజిక న్యాయం అనే అంశాలపై పోరాడిన కమ్యూనిస్టు పార్టీలో పెనుగొండ శాసనసభ్యుడిగా మూడుసార్లు పనిచేసిన వంకా సత్యనారాయణ తన 19వ ఏట పార్టీలో చేరారన్నారు.93వ ఏట కాలం చేశారన్నారు. కమ్యూనిస్టు పార్టీలో చేరిన నాటి నుండి తుది శ్వాస విడిచే వరకు పార్టీ అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషి చేశారన్నారు.ఆయన చూపిన బాట లొ పయనిస్తూ ఆయన మనుమడు డా అడ్డాల సత్యనారాయణ నిరంతరం ప్రజా సేవలో ఉండటం అభినంద నీయమని అన్నారు.
ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ “వంక సత్యనారాయణ పెద్ద మనవడునైన తాను ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు.అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ జరిగింది.
ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, అడబాల రత్న ప్రసాద్, బుద్ధరాజు సత్యనారాయణ రాజు,ఎస్.శ్రీ నగేష్, మంచెం సుబ్రహ్మణ్యేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.