కామారెడ్డి,13 జనవరి,( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, రామారెడ్డి గ్రామంలో, రాజమ్మ తండాలో తెలంగాణ గ్రామీణం అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిరుపేద వారు కట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది . ఇందులో భాగంగా రాజమ్మ తండాలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం ముగ్గు పోయడం జరిగిందని రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్ తెలిపారు.ఇందిరమ్మ కుటుంబ సభ్యులు సంతోషంగా ఆతిథ్యం అందించగా, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మన తెలుగు సంప్రదాయాలు మన గుండెల్లో ఉండాలి. నిరుపేదవారు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకొని సుఖ సంతోషాలతో ఐక్యంగా ఉండాలని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేవారీ కుటుంబానికి హృదయపూర్వక అభినందాలు తెలిపారు .గ్రామ పంచాయతీ నాయకులు, ఉప సర్పంచ్కు నవీన్ వార్డు సభ్యులు పిప్పిరి లింబాద్రి జిపి సిబ్బంది, కుటుంబ సభ్యులు ముగ్గు పూజలో పాల్గొన్నారు.



