సెప్టెంబర్ 30 పున్నమి ప్రతినిధి
గుంటూరు కొత్తపేటలోని రావుస్ ఆసుపత్రిలో జరిగిన విషాద ఘటన పెద్ద చర్చనీయాంశమైంది. భుజం నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన 35ఏళ్ల బ్రహ్మానందరెడ్డికి డాక్టర్ మోహన్ రావు మెడకు సర్జరీ చేశారని, ఆ సర్జరీ వల్లే తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని తల్లి పద్మావతి ఆరోపించారు. వైద్య నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, ముందుగానే 6 లక్షలు వసూలు చేశారని, మొత్తంగా 35 లక్షలు ఖర్చైనా తన కుమారుడిని కాపాడలేకపోయామంటూ ఆమె కన్నీటి గాధ వెల్లడించారు. 12 గంటలపాటు సర్జరీ విజయవంతమైందని డాక్టర్ చెప్పినా, తర్వాత తీవ్రమైన వాంతులు, విరేచనాలు వచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కి తరలించేందుకు అనుమతించకపోవడం వల్లే మరణం జరిగిందని అన్నారు. బాధితురాలు డీఎస్పీ, కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డాక్టర్ మోహన్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి సత్యకుమార్‌ను కలిసి, మెడికల్ కౌన్సిల్ అధికారులను కలుసుకుని న్యాయం కోసం పోరాడతానని పద్మావతి తెలిపారు.


