మంథని, ఆగస్టు 16: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురిలోని మల్లెపూల హనుమాన్ దేవాలయ నూతన అధ్యక్షుడిగా శనివారం బత్తుల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా గోరంట్ల సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా పుల్లే రవీందర్, కోశాధికారిగా పుల్లె రాధాకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా బండి రవి లను ఎన్నుకున్నారు.
ఈ కమిటీ రెండు సంవత్సరాల కాలపరిమితి 14 ఆగస్టు 2025 నుండి 14 ఆగస్టు 2027 వరకు కొనసాగుతుందని, ఈ కమిటీకి పద్మశాలి కులస్తులందరూ సహకరించినందుకు పద్మశాలి సంఘంకు నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా గంగాపురి మల్లెపూల హనుమాన్ దేవాలయ నూతన కమిటీ అధ్యక్షులు బత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ.. తమకు ఈ ఆలయ బాధ్యతలు నమ్మకంతో అప్పగించినందుకు, తమ బాధ్యతను శిరసా వహిస్తూ, అందరి నమ్మకాన్ని వమ్ము చేయమని, తమ కార్యవర్గం దేవాలయ అభివృద్ధి కోసం పాటు పడతామని నూతన దేవాలయ కార్యవర్గం తెలియజేశారు.


