Sunday, 7 December 2025
  • Home  
  • ఖాళీ మద్యం బాటిల్ ఇవ్వండి.. రూ.20 పొందండి!
- జాతీయ అంతర్జాతీయ

ఖాళీ మద్యం బాటిల్ ఇవ్వండి.. రూ.20 పొందండి!

సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @ ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా కేరళ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఖాళీ ప్లాస్టిక్ మద్యం బాటిల్స్ సేకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఖాళీ మద్యం బాటిల్ వెనక్కి ఇచ్చినట్లయితే.. రిఫండబుట్ డిపాజిట్ కింద వసూలు చేసిన రూ.20ను తిరిగి ఇవ్వనుంది. సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా నిర్దేశించిన కౌంటర్లలో వీటిని సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద తొలి విడతలో 20 బెవోకో కేంద్రాల్లో అమలు చేయనున్నారు. తిరువనంతపురంలో పది, కన్నూర్ జిల్లాలో పది కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాటిళ్లపై ప్రత్యేకంగా రూపొందించిన లేబుల్ (క్యూర్ కోడ్) ద్వారా వీటిని గుర్తించనున్నట్లు బెవరేజెస్ కార్పొరేషన్ వెల్లడించింది. వచ్చే జనవరి 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 300 బెవ్కో కేంద్రాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించే ఈ ప్రాజెక్టులో మహిళా సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వారానికి మూడు రోజుల పాటు ఈ కేంద్రాలు అందుబాటులో ఉండనున్నాయి. అయితే, మద్యం బాటిల్ కొనుగోలు చేసిన ప్రాంతంలోనే ఖాళీ బాటిల్ వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. రద్దీ నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్లు రీసైక్లింగ్ కోసం ‘క్లీన్ కేరళ కంపెనీ’కి అప్పగించామని తెలిపింది.

సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @
ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా కేరళ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఖాళీ ప్లాస్టిక్ మద్యం బాటిల్స్ సేకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఖాళీ మద్యం బాటిల్ వెనక్కి ఇచ్చినట్లయితే.. రిఫండబుట్ డిపాజిట్ కింద వసూలు చేసిన రూ.20ను తిరిగి ఇవ్వనుంది. సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా నిర్దేశించిన కౌంటర్లలో వీటిని సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

పైలట్ ప్రాజెక్టు కింద తొలి విడతలో 20 బెవోకో కేంద్రాల్లో అమలు చేయనున్నారు. తిరువనంతపురంలో పది, కన్నూర్ జిల్లాలో పది కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాటిళ్లపై ప్రత్యేకంగా రూపొందించిన లేబుల్ (క్యూర్ కోడ్) ద్వారా వీటిని గుర్తించనున్నట్లు బెవరేజెస్ కార్పొరేషన్ వెల్లడించింది. వచ్చే జనవరి 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 300 బెవ్కో కేంద్రాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.

ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించే ఈ ప్రాజెక్టులో మహిళా సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వారానికి మూడు రోజుల పాటు ఈ కేంద్రాలు అందుబాటులో ఉండనున్నాయి. అయితే, మద్యం బాటిల్ కొనుగోలు చేసిన ప్రాంతంలోనే ఖాళీ బాటిల్ వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. రద్దీ నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్లు రీసైక్లింగ్ కోసం ‘క్లీన్ కేరళ కంపెనీ’కి అప్పగించామని తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.