
శ్రీకాకుళం జిల్లాను పర్యావరణ పరిరక్షణలో ముందుకు నడిపిస్తూ, అత్యుత్తమ సేవలు అందించాలని కేంద్ర పౌరవిమానాయ శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.స్థానిక ఎంపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ అంతర్జాతీయ సంస్థలో శ్రీకాకుళం జిల్లా నుండి నూతనంగా ఎన్విరాన్మెంట్ చైర్మన్‌గా నియమితులైన లయన్ పొన్నాడ రవికుమార్‌కి అభినందనలు తెలిపారు.పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం నుండి అన్ని విధాల సహకారం అందిస్తామని, జిల్లాను పచ్చదనంతో నింపి, స్వచ్ఛమైన వాతావరణం ఏర్పరిచేలా స్వచ్ఛంద సంస్థలన్నీ కలసి పని చేయాలని సూచించారు.లయన్ రవికుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా గవర్నర్ లయన్ డా. సూర్యప్రకాష్‌కి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే తరాలకు స్థిరమైన భవిష్యత్తు కల్పించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా. పైడి సింధూర మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు.

