Friday, 6 February 2026
  • Home  
  • కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం
- విశాఖపట్నం

కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం

కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- కింగ్ జార్జి ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నంలో రేడియాలజిస్టులు, రేడియోగ్రాఫర్లు ఉత్సాహంగా పాల్గొని ఎక్స్రే ఆవిష్కర్త డాక్టర్ రాంట్జెన్ కి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేడియాలజిస్టుల సంఘ అధ్యక్షులు డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ప్రజల్లో రేడియాలజీ సేవల పట్ల అవగాహన తీసుకురావాలన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ వాణి సందేశాన్నిస్తూ ప్రజల నుండి రేడియాలజీ సేవల కోసం ఎంతో ఒత్తిడితో కూడిన డిమాండ్ ఉన్నప్పటికీ కేజీహెచ్ లో మంచి సేవలు అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తూ ఇంకా మెరుగైన సేవల కోసం ప్రయత్నం చేయాలన్నారు. రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ బుజ్జి బాబు తొలి పలుకులుగా అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ 2025 సంవత్సరం థీమ్ ని అనుసరించి రేడియో గ్రాఫర్స్ అంటే కంటికి కనిపించని జబ్బు ని చూపించేవారుగా అభివర్ణించి అభినందించారు.సమావేశంలో రేడియాలజీ ఫ్యాకల్టీ, రేడియోగ్రాఫర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, ఇమేజింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం
విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
కింగ్ జార్జి ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నంలో రేడియాలజిస్టులు, రేడియోగ్రాఫర్లు ఉత్సాహంగా పాల్గొని ఎక్స్రే ఆవిష్కర్త డాక్టర్ రాంట్జెన్ కి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేడియాలజిస్టుల సంఘ అధ్యక్షులు డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ప్రజల్లో రేడియాలజీ సేవల పట్ల అవగాహన తీసుకురావాలన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ వాణి సందేశాన్నిస్తూ ప్రజల నుండి రేడియాలజీ సేవల కోసం ఎంతో ఒత్తిడితో కూడిన డిమాండ్ ఉన్నప్పటికీ కేజీహెచ్ లో మంచి సేవలు అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తూ ఇంకా మెరుగైన సేవల కోసం ప్రయత్నం చేయాలన్నారు. రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ బుజ్జి బాబు తొలి పలుకులుగా అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ 2025 సంవత్సరం థీమ్ ని అనుసరించి రేడియో గ్రాఫర్స్ అంటే కంటికి కనిపించని జబ్బు ని చూపించేవారుగా అభివర్ణించి అభినందించారు.సమావేశంలో రేడియాలజీ ఫ్యాకల్టీ, రేడియోగ్రాఫర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, ఇమేజింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.