పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 06 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న 27 అర్బన్ మున్సిపాలిటీలను జిహెచ్ఎంసి లో విలనం చేస్తూ వాటికి జోన్ లను కేటాయిస్తూ విడుదలైనటువంటి జీవోలో భాగంగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను సౌత్ జోన్ లో ఉన్నటువంటి చార్మినార్ జోన్ లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శనివారం కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి రామిడి వీర కర్ణ రెడ్డి ల ఆధ్వర్యంలో బడంగ్ పేట్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బడంగ్పేట్ కో బచావో కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు, బిజెపి పార్లమెంట్ విప్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ మెప్పు కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని… మెజారిటీ ప్రజల అభిప్రాయానికి గౌరవించి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి యావత్ తెలంగాణ ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్తారని మండిపడ్డారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ బడంగ్ పేటను చార్మినార్ లో విలీనం చేయడం ద్వారా మరో 20 సంవత్సరాలు మన ప్రాంతం వెనుకబడుతుందని ఎలాంటి అభివృద్ధికి నోచుకోమని తెలిపారు. పాతబస్తీ లోని హిందువులందరూ అక్కడి బాధలు భరించలేక ఈ ప్రాంతంలో ప్రశాంతంగా నివసిస్తున్నారని మళ్లీ ఈ ప్రాంతాన్ని తీసుకెళ్లి చార్మినార్ లో కలిపి వారి మనోభావాలను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి దెబ్బతీసిందని ఆరోపించారు. వెంటనే బడంగ్ పేట్ ను ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ నాయకులు, వివిధ కాలనీ అధ్యక్షులు, వివిధ కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతును తెలిపారు.

*ఎంఐఎం మెప్పు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు – ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి –బడంగ్ పెట్ ను ప్రత్యేక జోన్ గా వెంటనే ప్రకటించాలి – శ్రీరాములు అందెల*