Monday, 23 March 2026
  • Home  
  • అభాగ్యులకు కెఎల్ఆర్ ట్రస్ట్ ఆపన్న హస్తం –మాతృదేవోభవ అనాథాశ్రమానికి రూ.10లక్షల వితరణ –జీవితాంతం పేదలకు సహయం అందిస్తా: కిచ్చెన్న* –ఐరన్, మెటీరియల్ అందటంపై నిర్వాహాకులు గిరి కృతజ్ఞతలు.
- రంగారెడ్డి

అభాగ్యులకు కెఎల్ఆర్ ట్రస్ట్ ఆపన్న హస్తం –మాతృదేవోభవ అనాథాశ్రమానికి రూ.10లక్షల వితరణ –జీవితాంతం పేదలకు సహయం అందిస్తా: కిచ్చెన్న* –ఐరన్, మెటీరియల్ అందటంపై నిర్వాహాకులు గిరి కృతజ్ఞతలు.

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 : పేదలకు, అభాగ్యులకు, పేద విద్యార్థులకు నిరంతరం కెఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవ చేసే భాగ్యం కలగటం తన అదృష్టమని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కెఎల్ఆర్ ట్రస్ట్ అధినేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. జిహెచ్ఎంసి డివిజన్ నాదర్ గుల్ గ్రామంలోని మాతృదేవో భవ అనాథాశ్రమానికి రూ.10 లక్షల విలువ చేసే భవన నిర్మాణ ఇనుము సహా మెటీరియల్ అందజేశారు ట్రస్ట్ నిర్వాహాకులు. అభాగ్యులు, నిరుపేదలు, మతిస్థిమితం లేని వారికి ఆశ్రమం కల్పిస్తున్న గట్టు గిరిని కేఎల్ఆర్ అభినందించారు. నూతన ఆశ్రమంలో జరుగుతున్న పనులను లక్ష్మారెడ్డి గతంలో పరిశీలించారు. తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.10లక్షల విలువైన మెటీరియల్ ను పంపటంతో అనాథాశ్రమ నిర్వాహాకులు గట్టు గిరి సంతోషం వ్యక్తం చేశారు. సేవకుడే నాయకుడు:– కాంగ్రెస్ నేతలు సేవకుడే నాయకుడు అంటూ పదేపదే మాట చెప్పే కిచ్చెన్నగారు… ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని నాదర్ గుల్ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పేదల కోసం కెఎల్ఆర్ ట్రస్ట్ స్థాపించి ఎందరికో సేవ చేస్తున్నారని కొనియాడారు. ఓట్ల కోసం కాకుండా పేద విద్యార్థుల కోసం సైతం *లీడ్ ఇండియా * స్థాపించి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను, నైపుణ్య శిక్షణను నేటి తరానికి లక్ష్మారెడ్డి అందిస్తున్నారని మహేశ్వరనియోజకవర్గం హస్తం పార్టీ నేతలు గుర్తు చేశారు.

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 : పేదలకు, అభాగ్యులకు, పేద విద్యార్థులకు నిరంతరం కెఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవ చేసే భాగ్యం కలగటం తన అదృష్టమని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కెఎల్ఆర్ ట్రస్ట్ అధినేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. జిహెచ్ఎంసి డివిజన్ నాదర్ గుల్ గ్రామంలోని మాతృదేవో భవ అనాథాశ్రమానికి రూ.10 లక్షల విలువ చేసే భవన నిర్మాణ ఇనుము సహా మెటీరియల్ అందజేశారు ట్రస్ట్ నిర్వాహాకులు. అభాగ్యులు, నిరుపేదలు, మతిస్థిమితం లేని వారికి ఆశ్రమం కల్పిస్తున్న గట్టు గిరిని కేఎల్ఆర్ అభినందించారు. నూతన ఆశ్రమంలో జరుగుతున్న పనులను లక్ష్మారెడ్డి గతంలో పరిశీలించారు. తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.10లక్షల విలువైన మెటీరియల్ ను పంపటంతో అనాథాశ్రమ నిర్వాహాకులు గట్టు గిరి సంతోషం వ్యక్తం చేశారు.
సేవకుడే నాయకుడు:–
కాంగ్రెస్ నేతలు సేవకుడే నాయకుడు అంటూ పదేపదే మాట చెప్పే కిచ్చెన్నగారు… ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని నాదర్ గుల్ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పేదల కోసం కెఎల్ఆర్ ట్రస్ట్ స్థాపించి ఎందరికో సేవ చేస్తున్నారని కొనియాడారు. ఓట్ల కోసం కాకుండా పేద విద్యార్థుల కోసం సైతం *లీడ్ ఇండియా * స్థాపించి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను, నైపుణ్య శిక్షణను నేటి తరానికి లక్ష్మారెడ్డి అందిస్తున్నారని మహేశ్వరనియోజకవర్గం హస్తం పార్టీ నేతలు గుర్తు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.