తోట్టంబేడు అక్టోబర్ 22, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరపని వర్షాలపట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ నిర్మల వాసుదేవ నాయుడు ప్రకంటన ద్వారా కోరారు. తొట్టంబేడు మండలంలోని పలు పంచాయతీలో లోతట్టు ప్రాంతంలో ఉన్న వరినాట్లు, కొనతనేరి,ఇలకనూరు, పొయ్య, చియ్యవరం, చోడవరం, కొమ్మనగుంట, గురుకులపాలెం, పూడి, రౌతు సూరమాల, తదితర గ్రామాలలో పంట పొలాల్లో వరి నాట్లు పూర్తిగా మునిగిపోయాయని, అదేవిధంగా భారీ వర్షాలకు మండలంలోని ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కొన్ని గ్రామాలలో పూరిగుడిసెలు, పడిపోవడం, ఇళ్లల్లో స్లాబులలో నుండి వర్షపునీరు ధారగా పడుతుంది. ఇండ్లు ఎప్పుడు కూలిపోటాయేమోనని మండల ప్రజలు భయాందోళన పడుతున్నారు. వర్షపు నీరు సజావుగా పోయే వసతిలేకపోవడంతో ఇళ్లల్లోకి నీరు చొచ్చుకు వచ్చి గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. లోతట్ట ప్రాంత ప్రజలు ఎక్కడికి పోలేక మండల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అదేవిధంగా పలు ప్రాంతాలలో చెరువులు, వాగులు, వంకలు, తెగిపోయాయని, లోతట్ట ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారని ఎంపీపీ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు డాక్టర్ కోగిల సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ.. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను, మండల ప్రజలను, ఆయా పంచాయతీల నుంచి ప్రభుత్వాధికారులు పర్యవేక్షణ చేపట్టి బాధితులను ఆదుకుని, వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలకు ఆహారాన్ని సమకూర్చి, వర్షాల కారణంగా అనారోగ్యంతో ఉన్నవారికి కనీస వైద్య సహాయాన్ని అందేలా సహాయక చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వర్షాలకు నష్టపోయిన రైతులను, కష్టాలలో ఉన్న మండల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

అధిక వర్షాలపట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉందాలి…. ఎంపీపీ నిర్మల వాసుదేవ నాయుడు