Thursday, 5 February 2026
  • Home  
  • అత్యవసర పేషెంట్‌కు SDAP ప్లేట్లెట్ల దానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అత్యవసర పేషెంట్‌కు SDAP ప్లేట్లెట్ల దానం

(నెల్లూరు — పున్నమి ప్రతినిధి) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి, పొట్టిశ్రీరాములు జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యుడు, రక్త నిధి కేంద్రం కోఆర్డినేటర్ బయ్యా ప్రసాద్ నారాయణ హాస్పిటల్‌లో అత్యవసర పేషెంట్‌కు సింగిల్ డోనార్ ఆఫరెసిస్ (SDAP) ద్వారా ప్లేట్లెట్లను దానం చేశారు. ఈ కార్యక్రమం ఛైర్మన్ వాకాటి విజయకుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ చమర్తి జనార్ధన్ రాజు సమక్షంలో జరిగింది. ప్రతి సంవత్సరం 16 వేలకుపైగా స్వచ్ఛంద రక్తదానాలు జరుగుతున్నాయని, వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్స్ పెరిగి రక్త కొరత ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు రక్తదానంపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజేంద్ర ప్రసాద్, డా. యశోవర్ధన్, మోటివేటర్లు మధుసూదనరావు, భాస్కర్ రావు, సాయిరాం పాల్గొన్నారు.

(నెల్లూరు — పున్నమి ప్రతినిధి)

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి, పొట్టిశ్రీరాములు జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యుడు, రక్త నిధి కేంద్రం కోఆర్డినేటర్ బయ్యా ప్రసాద్ నారాయణ హాస్పిటల్‌లో అత్యవసర పేషెంట్‌కు సింగిల్ డోనార్ ఆఫరెసిస్ (SDAP) ద్వారా ప్లేట్లెట్లను దానం చేశారు. ఈ కార్యక్రమం ఛైర్మన్ వాకాటి విజయకుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ చమర్తి జనార్ధన్ రాజు సమక్షంలో జరిగింది. ప్రతి సంవత్సరం 16 వేలకుపైగా స్వచ్ఛంద రక్తదానాలు జరుగుతున్నాయని, వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్స్ పెరిగి రక్త కొరత ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు రక్తదానంపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజేంద్ర ప్రసాద్, డా. యశోవర్ధన్, మోటివేటర్లు మధుసూదనరావు, భాస్కర్ రావు, సాయిరాం పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.