Friday, 6 February 2026
  • Home  
  • అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు
- తెలంగాణ - పెద్దపల్లి

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

*మంథని: అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు* మంథని, ఆగస్టు 07, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రం అంబేద్కర్ నగర్ లోని అంగన్ వాడి కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు ఈ సమావేశాల్లో అంగన్వాడి ఉపాధ్యాయురాలు మండల సుగుణ పలు సూచనలు చేశారు. చిన్నారులకు ఆరు నెలల వయసు వచ్చేవరకు బిడ్డకు కచ్చితంగా తల్లిపాలు తాగించాలని ఆమె సూచించారు. కొందరు తల్లిదండ్రులు రసాయన మిశ్రమాలతో తయారు చేసిన కృత్రిమ పాలు తాగించి, పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుందన్నారు. తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే అపోహాలను వీడి తల్లిపాలు త్రాగించాలని కోరారు. తల్లిపాల వలన బిడ్డ ఆయుష్షును పెంచిన వారవుతారని పేర్కొన్నారు. ముర్రుపాలు బిడ్డ రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్నారు. డబ్బా పాలు వద్దు… తల్లిపాలే ముద్దని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయు రాలు మండల సుగుణ తో పాటు.. అంగన్వాడి ఆయా రాజేశ్వరి, కాచర్ల కళావతి, కరెంగల రంజిత, పీక శృతి, కట్ల సౌందర్య, మంథిని చైతన్య, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

*మంథని: అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు*

మంథని, ఆగస్టు 07, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రం అంబేద్కర్ నగర్ లోని అంగన్ వాడి కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గర్భిణీలకు ఈ సమావేశాల్లో అంగన్వాడి ఉపాధ్యాయురాలు మండల సుగుణ పలు సూచనలు చేశారు. చిన్నారులకు ఆరు నెలల వయసు వచ్చేవరకు బిడ్డకు కచ్చితంగా తల్లిపాలు తాగించాలని ఆమె సూచించారు. కొందరు తల్లిదండ్రులు రసాయన మిశ్రమాలతో తయారు చేసిన కృత్రిమ పాలు తాగించి, పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం పేద మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుందన్నారు. తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే అపోహాలను వీడి తల్లిపాలు త్రాగించాలని కోరారు. తల్లిపాల వలన బిడ్డ ఆయుష్షును పెంచిన వారవుతారని పేర్కొన్నారు. ముర్రుపాలు బిడ్డ రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్నారు. డబ్బా పాలు వద్దు… తల్లిపాలే ముద్దని తెలియ జేశారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయు రాలు మండల సుగుణ తో పాటు.. అంగన్వాడి ఆయా రాజేశ్వరి, కాచర్ల కళావతి, కరెంగల రంజిత, పీక శృతి, కట్ల సౌందర్య, మంథిని చైతన్య, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.