దేవాదాయ భూముల జోలికి వెళ్లినవారు చరిత్రలో భాగుపడ్డ దాఖలాలు లేవు మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి
పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
23 జనవరి 2026
యాచారం మండలం నందివనపర్తి గ్రామంలోని “శ్రీ ఓంకారేశ్వరాలయానికి చెందిన దేవాదాయ భూములను పరిశ్రమల పేరుతో స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు” చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు *మంచిరెడ్డి కిషన్ రెడ్డి* అన్నారు.
ఈ దేవాదాయ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కౌలు రైతుల కడుపు కొట్టే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండటం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఈ విషయమై ఆయా గ్రామాలకు చెందిన రైతు నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని కలిసి తమ ఆవేదనను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“దేవాదాయ భూములను ముట్టుకుంటే చరిత్ర క్షమించదు. దేవుడి భూముల జోలికి వెళ్లినవారికి చరిత్రలో ఎప్పుడూ భాగుపడ్డ దాఖలాలు లేవు” అని హెచ్చరించారు.
ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో రానున్న రోజుల్లో రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.
దేవాలయాల ఆస్తులను, రైతుల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ చివరి వరకు పోరాడుతుందని ఆయన తెలిపారు.



