Monday, 23 March 2026
  • Home  
  • తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు డిమాండ్ ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్ళారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- Blog

తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు డిమాండ్ ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్ళారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

*తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ డిమాండ్* *కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దగ్గుమళ్ళ ప్రసాదరావు న్యూఢిల్లీడిసెంబర్ 4 ( విశాఖ పున్నమి ప్రతినిధి:-) తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు డిమాండ్ ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్ళారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు. అంతకు ముందు తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ డిమాండ్ అంశాన్ని తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు.., చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుతో సమీక్షించారు. దీనికి స్పందించిన పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దగ్గుమళ్ళ.., ముందుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంటు ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలతో చర్చించారు. అనంతరం వారు తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్లతో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను కలిసి,తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ డిమాండ్ ను అంశాన్ని తెలియజేశారు. అలాగే వినతి పత్రాన్ని కూడా అందజేసారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు , లావు కృష్ణదేవరాయలు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను రైల్వే మంత్రికి వివరించారు. ఏళ్లుగా నెలకొన్న డిమాండ్ ను పరిష్కరించాలని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అంతే కాకుండా యాత్రికుల తాకిడి పెరిగిన దృష్ట్యా తిరుచానూరు, రేణిగుంట రైల్వే స్టేషన్ లను అభివృద్ధి చేయాలని కోరారు. శ్రీ సిటీ పారిశ్రామిక అభివృద్ధి రీత్యా అంతర్జాతీయ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. కడప- బెంగుళూరు రైల్వే లైన్ సర్వే పూర్తి కాగా, పనులు వేగవంతం చేయాలన్నారు. నడికుడి- శ్రీకాళహస్తి పనుల్లో వేగం పెంచాలని విజ్ఞప్తి చేశారు. నాయుడు పేట, గూడూరు, తడ, పుత్తూరు, నగరి, సత్యసాయి ప్రశాంత నిలయం రైల్వే స్టేషన్లను తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. రద్దీ దృష్ట్యా తిరుపతి- గూడూరు మధ్య మూడవ లైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రికి సూచించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, పీ.సి. రాయల్, కే.వి.చౌదరి, బుచ్చిబాబు నాయుడు, రామచంద్రా రెడ్డి పాల్గొన్నారు.

*తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ డిమాండ్*

*కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దగ్గుమళ్ళ ప్రసాదరావు
న్యూఢిల్లీడిసెంబర్ 4 ( విశాఖ పున్నమి ప్రతినిధి:-)

తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు డిమాండ్ ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్ళారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.

అంతకు ముందు తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ డిమాండ్ అంశాన్ని తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు.., చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుతో సమీక్షించారు. దీనికి స్పందించిన పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దగ్గుమళ్ళ.., ముందుగా
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంటు ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలతో చర్చించారు.

అనంతరం వారు తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్లతో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను కలిసి,తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ డిమాండ్ ను అంశాన్ని తెలియజేశారు. అలాగే వినతి పత్రాన్ని కూడా అందజేసారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు , లావు కృష్ణదేవరాయలు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు..
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను రైల్వే మంత్రికి వివరించారు. ఏళ్లుగా నెలకొన్న డిమాండ్ ను పరిష్కరించాలని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అంతే కాకుండా యాత్రికుల తాకిడి పెరిగిన దృష్ట్యా తిరుచానూరు, రేణిగుంట రైల్వే స్టేషన్ లను అభివృద్ధి చేయాలని కోరారు. శ్రీ సిటీ పారిశ్రామిక అభివృద్ధి రీత్యా అంతర్జాతీయ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. కడప- బెంగుళూరు రైల్వే లైన్ సర్వే పూర్తి కాగా, పనులు వేగవంతం చేయాలన్నారు. నడికుడి- శ్రీకాళహస్తి పనుల్లో వేగం పెంచాలని విజ్ఞప్తి చేశారు.

నాయుడు పేట, గూడూరు, తడ, పుత్తూరు, నగరి, సత్యసాయి ప్రశాంత నిలయం రైల్వే స్టేషన్లను తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. రద్దీ దృష్ట్యా తిరుపతి- గూడూరు మధ్య మూడవ లైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రికి సూచించారు.

ఈ కార్యక్రమంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, పీ.సి. రాయల్, కే.వి.చౌదరి, బుచ్చిబాబు నాయుడు, రామచంద్రా రెడ్డి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.