మంగళగిరి అక్టోబర్ పున్నమి ప్రతినిధి, విశాఖపట్నం
*జగన్ పుట్టుకతోనే నేరస్థుడు*
*జగన్ నేర నటననే వైసీపీ నాయకులు నేర్చుకున్నారు*
*జగన్ రెడ్డి పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. బుధవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జగన్ నేరాలు చేస్తాడు, నేరస్థులను ప్రోత్సహిస్తాడని విమర్శించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపాడు గ్రామంలో ప్రపంచానికే విజ్ఞాన దిక్సూచిగా నిలిచిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు పెట్టి, తాము సుద్ధపూసలమని, ఏమీ తెలియదన్నట్టు నాటకాలాడారు. వైసీపీ సర్పంచ్ గోవిందప్ప రాత్రికి రాత్రి అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. తర్వాత పోలీసులకు ఫోన్ చేసి, గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారని అబద్ధం చెప్పాడని ఆరోపించాడు. మరుసటి రోజు మాజీ మంత్రి నారాయణస్వామి, వైసీపీ నేత కరుణాకర్ రెడ్డితో కలిసి పెద్ద ఎత్తున ధర్నా పేరుతో డ్రామాలాడారు. సీసీ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ పరిశీలనలో గోవిందయ్య దొరికిపోవడంతో వారి నాటకం బట్టబయలైంది. ఏమీ ఎరగనట్టు ధర్నా చేయడం, నటించడంలో వైసీపీ నాయకులకు సాటి లేరు. బాబాయ్ ని చంపించి చంద్రబాబునాయుడు చేతిలో కత్తి పెట్టి నారాసురరక్త చరిత్ర అని కమల్ హాసన్ ను మించి జగన్ యాక్టింగ్ చేశాడు. జగన్ కమల్ హాసన్ మించి యాక్టింగ్ చేస్తే.. జగన్ మించిన యాక్టింగ్ చేసిన వ్యక్తి గోవిందప్ప ..అంబేద్కర్ విగ్రహాన్ని కి నిప్పు పెట్టిన వైసీపీ సర్పంచ్ గోవిందప్ప ను జగన్ ఎందుకు సస్పెండ్ చేయలేదు..? రాష్ట్రంలో వైసీపీ పోకడలు అతి జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డాడు. దళితులు నా మేనమామలు అంటూనే గత ఐదేళ్లు దళితుల గొంతులు కోశారు. జగన్ తన కారుతో రోడ్లపై దళితుల తలలు తొక్కించుకుంటూ వెళ్లాడు. జగన్ పుట్టుకతోనే నేరస్థుడు. తన సొంత బాబాయిని చంపి చంద్రబాబుపై నెట్టాలని చూశాడు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చి, ఈ పని కూటమి ప్రభుత్వానిదని నమ్మబలుకు ప్రయత్నం చేశారు. జగన్ రెడ్డి నేరస్థుల ముఠా గురించి చాంతాడంత చెప్పవచ్చు. వైసీపీ నాయకులది టెర్రరిస్టుల స్వభావం. రాజకీయ ముసుగు వేసుకుని చేయరాని పనులన్నీ చేస్తున్నారు. వైసీపీ హయాంలో పనిచేసిన అధికారులు అవినీతిపరులుగా మిగిలిపోతున్నారు. ఈ టెర్రరిస్టు పార్టీలో ఎవరూ ఉండొద్దని సూచిస్తున్నాను. జగన్ వింత రాజకీయాలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే 11 సీట్లకు పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పాలనను వైసీపీ నాయకులు ఒర్వలేకపోతున్నారు. జగన్ హయాంలో రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా రాలేదు. టీడీపీ ప్రభుత్వం తెచ్చిన పరిశ్రమలను తరిమేశారు. కూటమి ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చింది. దేశ-విదేశాల్లో రాష్ట్ర గౌరవాన్ని పెంచింది. చంద్రబాబు, లోకేష్, మంత్రివర్గం దేశ-విదేశాల్లో తిరిగి పరిశ్రమలు, పెట్టుబడులు తెస్తున్నారు. వైసీపీ నాయకులు అది చూసి కడుపు మంటతో కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కందుకూరులో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణను కులచిచ్చుగా పెట్టాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. హత్య చేసిన హరిశ్చంద్రప్రసాద్ను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచింది. ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తోంది. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. గంజాయి ముఠాలతో సంబంధాలు పెట్టుకుంటోంది, వారికి సంఘీభావం తెలుపుతోంది. గోవిందప్ప, జగన్ లాంటి వ్యక్తులు చేసే ఆకృత్యాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిల్లి మాణిక్యరావు పిలుపునిచ్చారు.

