శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ప్రచార రథాన్ని నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలకు పంపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గంలోని మొత్తం 135 గ్రామ పంచాయతీల్లో ఈ ప్రచార రథం తిరుగుతూ ఆలయ ప్రాశస్త్యం, పూజలు, సేవలు, ఉత్సవాల వివరాలను భక్తులకు తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రచార రథం ద్వారా ఆలయంలో భక్తులకు అందిస్తున్న సదుపాయాలు, పూజా టిక్కెట్ల వివరాలు, వివిధ సేవలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే దేవస్థానం అద్దె గదుల్లో బస చేసే భక్తులకు అన్నప్రసాదం అందించే చర్యలు తీసుకున్నట్లు కొత్త ఈఓ బీకే వెంకటేశులును ఆయన అభినందించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్ నుంచి దేవస్థానం వరకు ఉచిత బస్సులు నడిపే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. చైర్మన్ ఛాంబర్లో సీసీ కెమెరాల ఏర్పాటు పై వస్తున్న విమర్శలను ఖండించిన ఆయన, ఆలయంలో అవినీతి మరియు అక్రమాలను అరికట్టేందుకు ఇవి ఉపయోగపడతాయని అన్నారు. ట్రస్ట్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రచార రథాన్ని ప్రతి గ్రామానికి పంపేలా అనుమతి తీసుకుంటామని తెలిపారు.

గ్రామాలన్నింటికి శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రచార రథం- దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి