Friday, 11 July 2025
  • Home  
  • గూడూరు లో మరో షహీన్ బాగ్..
- Featured - ఆంధ్రప్రదేశ్ - గూడూరు

గూడూరు లో మరో షహీన్ బాగ్..

ఢిల్లీ షహీన్ బాగ్ ( పున్నమి ప్రతినిధి గూడూరు) రగిలించిన స్ఫూర్తి భారతదేశమంతటా విస్తరిస్తోంది. మతోన్మాదుల ఆశయాలను అడియాశలు చేస్తూ దేశమంతటా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా మహిళలు తమ నిరసనలను దీక్షల రూపంలో తెలియజేస్తున్నారు. పాలకుల మనసులు మారాలని తద్వారా హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి సమైక్యతను కాపాడుకోవాలని దీనికి రాజ్యాంగ రక్షణే శిరోధార్యమని ప్రజలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా గూడూరు  పట్టణంలో గత 27 రోజులుగా స్థానిక పెద్ద మసీదునందు కులమతాలకతీతంగా ప్రజలు తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నేడు గూడూరు మహిళలు కూడా దీక్షలో పాల్గొనడం ఈ ఉద్యమానికి మరింత వూతం లభించినట్లయింది. గూడూరు పట్టణ చరిత్రలో అప్పుడెప్పుడో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళలు తిరిగి అదే మసీదు నందు తమ దీక్షను ప్రారంభించడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ షంషేర్ మాట్లాడుతూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను తెచ్చింది కనుక ప్రజలందరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈమె కోరారు. దేశంలోని ప్రజలంతా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఈమె వాపోయారు. NPR చట్టాలకు వ్యతిరేకంగా వైయస్ జగన్ గారు అసెంబ్లీలో తీర్మానం చేస్తామనడం మంచి పరిణామమని షంషేర్ చెప్పారు. స్వాతంత్రం కోసం ఎందరో ముస్లిములు ప్రాణత్యాగం చేశారు అలాంటి ముస్లింలను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని, అలాగే నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని బిజెపి నాయకులను హెచ్చరించారు. హాషిం..ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు హాషిం మాట్లాడుతూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ చట్టాలపై పూర్తి అవగాహన ఉందని కనుకనే మహిళలు ఈ నల్లచట్టాలకు  వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే గూడూరు పట్టణంలో మహిళలు సైతం దీక్షలో పాల్గొనడం కేంద్ర ప్రభుత్వాలకు చెంప పెట్టు లాంటిదని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని తల్లితో పేర్కొనే మోడీ, అమిత్షాలు భారతదేశంలోని తల్లులను వీధుల్లోకి లాగటం ఎంతవరకు సమంజమని పేర్కొన్నారు. ఇది బీజేపీ నాయకుల కుటిలత్వాన్ని సూచిస్తుందని ఈయన స్పష్టం చేశారు.

ఢిల్లీ షహీన్ బాగ్

( పున్నమి ప్రతినిధి గూడూరు)
రగిలించిన స్ఫూర్తి భారతదేశమంతటా విస్తరిస్తోంది. మతోన్మాదుల ఆశయాలను అడియాశలు చేస్తూ దేశమంతటా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా మహిళలు తమ నిరసనలను దీక్షల రూపంలో తెలియజేస్తున్నారు. పాలకుల మనసులు మారాలని తద్వారా హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి సమైక్యతను కాపాడుకోవాలని దీనికి రాజ్యాంగ రక్షణే శిరోధార్యమని ప్రజలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా గూడూరు  పట్టణంలో గత 27 రోజులుగా స్థానిక పెద్ద మసీదునందు కులమతాలకతీతంగా ప్రజలు తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నేడు గూడూరు మహిళలు కూడా దీక్షలో పాల్గొనడం ఈ ఉద్యమానికి మరింత వూతం లభించినట్లయింది. గూడూరు పట్టణ చరిత్రలో అప్పుడెప్పుడో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళలు తిరిగి అదే మసీదు నందు తమ దీక్షను ప్రారంభించడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ షంషేర్ మాట్లాడుతూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను తెచ్చింది కనుక ప్రజలందరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈమె కోరారు. దేశంలోని ప్రజలంతా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఈమె వాపోయారు. NPR చట్టాలకు వ్యతిరేకంగా వైయస్ జగన్ గారు అసెంబ్లీలో తీర్మానం చేస్తామనడం మంచి పరిణామమని షంషేర్ చెప్పారు. స్వాతంత్రం కోసం ఎందరో ముస్లిములు ప్రాణత్యాగం చేశారు అలాంటి ముస్లింలను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని, అలాగే నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని బిజెపి నాయకులను హెచ్చరించారు.

హాషిం..ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు హాషిం మాట్లాడుతూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ చట్టాలపై పూర్తి అవగాహన ఉందని కనుకనే మహిళలు ఈ నల్లచట్టాలకు  వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే గూడూరు పట్టణంలో మహిళలు సైతం దీక్షలో పాల్గొనడం కేంద్ర ప్రభుత్వాలకు చెంప పెట్టు లాంటిదని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని తల్లితో పేర్కొనే మోడీ, అమిత్షాలు భారతదేశంలోని తల్లులను వీధుల్లోకి లాగటం ఎంతవరకు సమంజమని పేర్కొన్నారు. ఇది బీజేపీ నాయకుల కుటిలత్వాన్ని సూచిస్తుందని ఈయన స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.