Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఆత్మకూరు సీఐపై మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

Punnami Newsroom Published:
ఆత్మకూరు సీఐపై మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

Story highlights

  • Uploaded Video:

ఆత్మకూరు: ఆత్మకూరు సీఐ గంగాధర్‌పై మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్థిని అనుమతించకుండా సీఐ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఐను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ముందుగానే ఎన్నికల కమిషన్, కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ఆయనతోనే ఎన్నికల విధులు నిర్వహింపజేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఐ అధికార పార్టీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మేకపాటి విక్రమ్ రెడ్డి కోరారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *