Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Andhra Pradesh

ఆత్మకూరులో కూటమి ఘన విజయం ఖాయం!

Punnami Newsroom Published:
ఆత్మకూరులో కూటమి ఘన విజయం ఖాయం!

Story highlights

  • ఆత్మకూరు, నవంబర్ 1 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
  • మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఎన్నికల నిర్వహణకు సహకరించిన అధికారులు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఓటు హక్కును వినియోగించుకున్న పట్టణ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికల సందర్భంగా ప్రజలు చూపిన ఉత్సాహం ప్రజాస్వామ్యంపై…
  • ఆత్మకూరు మున్సిపాలిటీలో 73.09 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషమని, ముఖ్యంగా 27వ వార్డులో అత్యధికంగా 89.44 శాతం పోలింగ్ నమోదవడం ప్రజల చైతన్యానికి ప్రతీక అని తెలిపారు.

73.09 శాతం పోలింగ్ ప్రజాస్వామ్య చైతన్యానికి నిదర్శనం

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఆత్మకూరు, నవంబర్ 1 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఎన్నికల నిర్వహణకు సహకరించిన అధికారులు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఓటు హక్కును వినియోగించుకున్న పట్టణ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికల సందర్భంగా ప్రజలు చూపిన ఉత్సాహం ప్రజాస్వామ్యంపై వారికున్న విశ్వాసానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో 73.09 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషమని, ముఖ్యంగా 27వ వార్డులో అత్యధికంగా 89.44 శాతం పోలింగ్ నమోదవడం ప్రజల చైతన్యానికి ప్రతీక అని తెలిపారు. మొత్తం 28 వార్డుల్లోని 30 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకున్న ఆసక్తిని తెలియజేస్తోందన్నారు. అత్యల్పంగా మూడో వార్డులో 57 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.కూటమి విజయంపై ధీమాఆత్మకూరు మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థుల గెలుపుపై ప్రజలు ముందుగానే నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్నికల ప్రచారంలో సమన్వయంతో పనిచేశారని తెలిపారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంతృప్తితో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని మంత్రి పేర్కొన్నారు. తనకు గెలుపోటములు కొత్త కాదని, అయితే ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు చూపిన ఆదరణ, ఉత్సాహం ఎంతో సంతోషాన్ని కలిగించాయని అన్నారు.అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంఆత్మకూరు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ఐదేళ్ల పదవీకాలంలో చేపట్టాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతి ఏటా ప్రణాళికలు రూపొందించి, వాటి ప్రకారం పరిపాలన సాగిస్తామని తెలిపారు.కూటమిలోని మూడు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తారని, ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు. పురపాలక సంఘం నోటిఫికేషన్, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చైర్‌పర్సన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, వైస్ చైర్‌పర్సన్, కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ చేపడతామని తెలిపారు.రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని, ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ప్రజల మధ్య అనుబంధాలు కొనసాగాలని ఆనం రామనారాయణరెడ్డి ఆకాంక్షించారు. ఆత్మకూరు పట్టణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, సీనియర్ టీడీపీ నాయకులు తాళ్లూరి గిరినాయుడు, యువ నాయకులు బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి, చల్లా రవికుమార్ రెడ్డి, కేతా విజయభాస్కర్ రెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *