జడ్పిటిసి అభ్యర్థి కర్తం సురేంద్రరెడ్డితో కలిసి తమ తమ ప్రాంతాల్లో ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచారం
పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బోగోలు మండలంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. జడ్పీటీసీ అభ్యర్థి కర్తం సురేంద్రరెడ్డి మండలంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు.
విశ్వనాథరావుపేట బిట్–2 పరిధిలో ఎంపీటీసీ అభ్యర్థి గోపిశెట్టి సంధ్య, బోగోలు బిట్–3 పరిధిలో ఎంపీటీసీ అభ్యర్థి చార్లెస్ అనిల్ కుమార్, నాగులవరం పరిధిలో ఎంపీటీసీ అభ్యర్థి ఆదిరెడ్డి వంశీ రెడ్డి తమ తమ ప్రాంతాల్లో జడ్పీటీసీ అభ్యర్థి కర్తం సురేంద్రరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల ఓటర్లను నేరుగా కలుసుకుని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా కర్తం సురేంద్రరెడ్డి మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రెండు బ్యాలెట్ పత్రాల్లోనూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజాసేవకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రాజశేఖర్, కోట జనార్దన్ రెడ్డి, రాజా, శివారెడ్డి, బిజ్జం రమేష్ రెడ్డి, మునగాల జనార్దన్ రెడ్డి, రవీంద్రారెడ్డి, మేకల శ్రీనివాసులు, సుజాత, ఈ మల్లారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, వెంకట్రామిరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



News Sources
- Punnami ReportingOwn reporting