Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

అనారోగ్యంతో మృతి చెందిన నారాయణ కుటుంబానికి పీఎస్‌ఆర్ ట్రస్ట్ అండ

రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత..

తిరుమలాయపాలెం, అక్టోబర్ 3

అనారోగ్యంతో మృతి చెందిన కాకరవాయి గ్రామానికి చెందిన పిండిప్రోలు నారాయణ కుటుంబానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలోని పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు అండగా నిలిచింది. శనివారం ట్రస్టు తరఫున నారాయణ కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఆపదలో అండగా ఉంటామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, మండల నాయకులు కటుకూరి శ్రీనివాసరెడ్డి,సామ శ్రీనివాస్ రెడ్డి, తవడబోయిన కృష్ణ, మోరపాక నాగయ్య, వేణుగోపాలస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గుండాల లింగయ్య, కొత్తపెళ్లి మల్లయ్య, గుండెబోయిన శ్రీశైలం, కాంగ్రెస్ యువజన నాయకులు దోనెపల్లి వినోద్, బండారి గంగరాజు, కొత్తపెళ్లి రవి, దామెర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *