Thursday, 12 February 2026
  • Home  
  • హైదరాబాదులో కొప్పల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన
- అనకాపల్లి

హైదరాబాదులో కొప్పల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన

ఆదివారం హైదరాబాద్‌లో కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీకమాసం సందర్భంగా నిర్వహించిన పిక్నిక్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి వి జి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ పి వి జి కుమార్ “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువకిశోరం నారా లోకేశ్ బాబు కొప్పుల వెలమల అభివృద్ధికి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ— “తెలంగాణ ప్రభుత్వం కొప్పుల వెలమలను బిసి జాబితా నుండి తొలగించి ఓ సి కేటగిరీలో చేరించడం చాలా బాధాకరం. ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, మన వర్గ హక్కుల సాధన కోసం కృషి చేస్తాను” అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘాధ్యక్షులు బాబురావు, నూకరాపు సూర్యప్రకాశరావు సహా ఇతర పెద్దలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆదివారం హైదరాబాద్‌లో కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీకమాసం సందర్భంగా నిర్వహించిన పిక్నిక్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి వి జి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సందర్భంగా మాట్లాడుతూ పి వి జి కుమార్
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువకిశోరం నారా లోకేశ్ బాబు కొప్పుల వెలమల అభివృద్ధికి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.

అలాగే ఆయన మాట్లాడుతూ—
“తెలంగాణ ప్రభుత్వం కొప్పుల వెలమలను బిసి జాబితా నుండి తొలగించి ఓ సి కేటగిరీలో చేరించడం చాలా బాధాకరం. ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, మన వర్గ హక్కుల సాధన కోసం కృషి చేస్తాను” అని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో సంఘాధ్యక్షులు బాబురావు, నూకరాపు సూర్యప్రకాశరావు సహా ఇతర పెద్దలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.