నేటి ఆధునిక జీవన విధానంలో జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతున్నది. ఒక వ్యక్తి యొక్క గుండె ఆగిపోయినప్పుడు లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోయినప్పుడు వారి ప్రాణాలను కాపాడడానికి చేసే ఒక అత్యవసర చికిత్స సి.పి. ఆర్ మణిదీప్ మువ్వల మరియు ధ్రువన్ జి రెడ్డి అనే విద్యార్థులు అతి చిన్న వయసులోనే ఆదర్శ సేవా దృక్పథంతో అమెరికా నుండి భారత్ కు వచ్చి ఆంధ్రప్రదేశ్ లోఎన్నో పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సి.పి.ఆర్ పై అవగాహన కలిగిస్తూ విద్యార్థులందరికీ స్ఫూర్తిని అందిస్తున్నారు. ఈ సందర్భంగా బాల అకాడమీ కి విచ్చేసి సి.పి.ఆర్ ను ఎలా చేయాలి, దాని వలన కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు అర్థమయ్యేలా తెలిపారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సునీత సమాధానాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు రజనీ ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా బాలకాడమీ ప్రిన్సిపల్ మాధవి లత మాట్లాడుతూ సిపిఆర్ పై అవగాహన కలిగించి, విద్యార్థులను ప్రోత్సహించినందుకు మెడ్ ఇంపాక్ట్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు విద్యార్థులు మణిదీప్ మువ్వల మరియు ధ్రువన్ జి రెడ్డి ని సత్కరించి సన్మానించారు.
ప్రాణాలను రక్షించడానికి యువతను శక్తివంతం చేయడం- సి.పి.ఆర్ ప్రధాన లక్ష్యం.

సి.పి.ఆర్ నేర్చుకుందాం నిండు ప్రాణాన్ని కాపాడుదాం డాక్టర్ సునీత ఆధ్వర్యంలో బాల అకాడమీలో విద్యార్థులకు సి.పి.ఆర్ పై అవగాహన సదస్సు
నేటి ఆధునిక జీవన విధానంలో జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతున్నది. ఒక వ్యక్తి యొక్క గుండె ఆగిపోయినప్పుడు లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోయినప్పుడు వారి ప్రాణాలను కాపాడడానికి చేసే ఒక అత్యవసర చికిత్స సి.పి. ఆర్ మణిదీప్ మువ్వల మరియు ధ్రువన్ జి రెడ్డి అనే విద్యార్థులు అతి చిన్న వయసులోనే ఆదర్శ సేవా దృక్పథంతో అమెరికా నుండి భారత్ కు వచ్చి ఆంధ్రప్రదేశ్ లోఎన్నో పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సి.పి.ఆర్ పై అవగాహన కలిగిస్తూ విద్యార్థులందరికీ స్ఫూర్తిని అందిస్తున్నారు. ఈ సందర్భంగా బాల అకాడమీ కి విచ్చేసి సి.పి.ఆర్ ను ఎలా చేయాలి, దాని వలన కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు అర్థమయ్యేలా తెలిపారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సునీత సమాధానాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు రజనీ ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా బాలకాడమీ ప్రిన్సిపల్ మాధవి లత మాట్లాడుతూ సిపిఆర్ పై అవగాహన కలిగించి, విద్యార్థులను ప్రోత్సహించినందుకు మెడ్ ఇంపాక్ట్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు విద్యార్థులు మణిదీప్ మువ్వల మరియు ధ్రువన్ జి రెడ్డి ని సత్కరించి సన్మానించారు. ప్రాణాలను రక్షించడానికి యువతను శక్తివంతం చేయడం- సి.పి.ఆర్ ప్రధాన లక్ష్యం.

