గొప్ప గొప్ప సాఫ్ట్‌వేర్ నిపుణులు, మామూలు ఉద్యోగులకంటే ఏ 10 రెట్లో, 100 రెట్లో కాదు… ఏకంగా 10,000 రెట్లు ఎక్కువ ఉత్పాదకత కలిగిన వారు అంటారు నాధన్ మైరో వోల్ట్ , మాజీ మైక్రోసాప్ట్ ముఖ్య శాస్త్రవేత్త.మనలను ఒక రంగంలో జీనియస్‌గా ఉధ్భవింపచేసే ఒక అరుదైన ప్రతిభ ‘ఆపన’ అనే రూపంలో నిగూఢంగా మనందరిలో నిర్రావస్థలో ఉంటుంది.అది చేయడాన్ని మీరు ప్రేమిస్తారు.ఆ పనిని అలవోకగా చేస్తారు.అది తప్ప ఇంకే పని చేయడమైనా మీకు కష్టంగా ఉంటుంది.ఆ ప్రవృత్తినే, మీ వృత్తిగా మలచుకొంటే మీరు ఆనందాన్ని పొందుతూ డబ్బు సంపాదిస్తారు.మనలో ఉన్న టాలెంట్‌ను గుర్తించడం, అది ఇతరులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకోవడం, అదే ఒక జీవిత లక్ష్యంగా మలచుకోవడం – ప్రశాంతత, సంపద రెండూ పొందే సులభ మార్గం.
ఒకప్పుడు మనిషి వేటకెళ్ళి బ్రతుకుతెరువు సాగించే వాడు. నాగరికత పెరిగిన తరువాత. కర్మాగారాలు పెట్టి యంత్రాలతో ఉత్పత్తి చేసి జీవించాడు.గత రెండు దశాబ్దాలనుండి సమాచార విప్లవంతో వచ్చిన మార్పుల వల్ల , ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ సాయంతో ప్రగతి సాధించాడు.కానీ భవిష్యత్‌లో మేధస్సులే కాక కళాత్మక హృదయం, సృజనాత్మకత, మానవత్వంతో కూడిన నాయకత్వం ఉన్నవారే ఏ రంగంలో అయినా నాయకులుగా ఎదిగే అవకాశముంది.మీరింత గొప్ప జీనియస్ ఎలా అయ్యారు అని ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ అనే శాస్త్రవేత్తను అడిగినప్పుడు. ఆయన ఇలా సమాధానం చెప్పారు.‘‘ నేను జీనియస్ కాదు కానీ క్యూరియస్ అంటే కుతూహలంకలవాడిని అలా జీనియస్‌గా రూపొందాను.మీకు ఏరంగంలో అటువంటి క్యూరియాసిటీ ఉందో, ఏ రంగంలో అయితే మీరు పూర్తిగా మమేకమైపోయి కృషి చేయగలరా ఆ రంగాన్ని గుర్తించాలి.
ఉన్న సహజ ప్రతిభ మనం ఆయా పనులకు ఎక్స్‌పోజ్ అయినప్పుడు బయటపడుతుంది.ఉదాహరణకు, సానియా మీర్జా గారిని 7 సం।।ల వయస్సు ఉన్నప్పుడు ఆమె తండ్రి తనతో పాటు టెన్నిస్ ఆడడానికి తీసుకువెళ్ళడట అక్కడ ఒక ఆటగాడు రాకపోయేసరికి ఈ అమ్మాయికి ఆడే అవకాశం వచ్చిందట. ఆ అమ్మాయిలో ఉన్న సహజ ప్రతిభను అక్కడ ఉన్నవారు గుర్తించడం జరిగింది.ఆ అమ్మాయి ఛాంపియన్ కావడానికి ఆ తండ్రి అండగా నిలవడంతో ఆ అమ్మాయి తారాపథాన్ని చేరుకోకలిగింది. అలా మనం కూడా ఒక తారాపథాన్ని చేరుకోగల అవకాశం ఒక అరుదైన ప్రతిభ రూపంలో ప్రతి ఒక్కరిలో వేచి చూస్తూ ఉంటుంది.అది బయట వెతికితే దొరకని గని, ఆయిల్ కావాలంటే, డ్రిల్ చేయాలి. భూ గర్భాల్లో , సముద్ర గర్భాల్లో ఎడారులలో ఎక్కడైన దొరకవచ్చు. కానీ మానవ ప్రతిభ కళాశాలల్లో యూనివర్సిటీలలో దొరకని గని భగవంతుడు ఆ గనిని మానవ హృదయాంతరాలలో నిక్షిప్తం చేసాడు.కానీ మనిషి అన్ని చోట్లకీ పయనిస్తాడు తన అంతరంగంలోకి తప్ప మనందరిలోనూ చాలా టాలెంట్స్ ఉంటాయి. కానీ ఒక అసమాన ప్రతిభ , ప్రపంచం ఎదురుచూపే ఒక ప్రత్యేక ప్రతిభ, మీకు సంపదనిచ్చి, ఎల్లకాలం మీకు గౌరవాన్నిచ్చే ప్రతిభ ఒకటి ఉంటుంది. ఆ పని చేయమని మీ మనసు ఎప్పుడూ కోరుతుంటుంది. మన మందరం కావాల నుకుంటే మనం ఊహించలేని మరొక అద్భాత సౌందర్య స్థాయిలో జీవించవచ్చు. అది మన సహజ సిర్ధమైన జీవితం. చిన్న పిల్లలలగా లీనమై ఉండే స్థితి. ఆ స్థితే సత్యమైనది, స్వచ్ఛమైనది. నేనవరు ? అనేదాని మొక్క సంపూర్ణ సారం దానినే యధార్ధమైన స్వీయతత్త్వం ( అధ్లెంటిక్స్ సెల్ఫ్) గా పిలుస్తారు. మీ అంతరంగ లోతుల్లో మాత్రమ కనుగొనబడే మీరైన తత్త్వం అది.మీ వృత్తి , పాత్రను బట్టి నిర్వచింపబడని మీలో భాగం మీ నైపుణ్యాలు, టాలెంట్స్, జ్ఞానం అన్నింటి యొక్క సమాహార రూపం అది. మీరైన సమస్తవలా అదే ! అది వ్యక్తీకరింపబడవలసి, బయటకు వెల్లువై రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

బద్దిపూడి శీనయ్య, నెల్లూరు.

