Tuesday, 9 December 2025
  • Home  
  • సర్పంచ్ లపై నిందలు వద్దు” – కాకాణి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్పంచ్ లపై నిందలు వద్దు” – కాకాణి

*”సర్పంచ్ లపై నిందలు వద్దు” – కాకాణి* *SPS నెల్లూరు జిల్లా:* *తేది:19-09-2025* *నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలోని జిల్లా పంచాయతీ కార్యాలయానికి సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్లి, వారిపై జరుగుతున్న  వేధింపులు, ప్రోటోకాల్ ఉల్లంఘన, వివిధ అంశాలపై జిల్లా పంచాయతీ అధికారితో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.* *సర్పంచులకు జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిన షోకాజులకు వివరణ అడిగిన కాకాణి* *కరెంట్ బిల్లులు చెల్లించినా, చెల్లించిన మొత్తం నిధులు దుర్వినియోగం అయ్యాయని రాయడానికి మీకు మనసు ఎలా వచ్చిందని నిలదీసిన కాకాణి.* *కాకాణి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు.* *మా పార్టీ సర్పంచులపై నిందలు వేయవద్దు, మేమే రాజీనామాలు చేస్తామని పేర్కొన్న కాకాణి.* *జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సర్పంచులు అని కూడా చూడకుండా, దారుణమైన నిందలు వేస్తున్నారు.* *సర్పంచులకు కనీసం మర్యాద ఇవ్వకుండా, ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూ, ఫిర్యాదులు చేస్తున్నా, జిల్లా అధికారులు మౌనవ్రతం పాటించడం సరికాదన్న కాకాణి.* *మీడియా సమక్షంలోనే సర్పంచులు నిబంధనల మేర ఖర్చు చేసిన వాటికి కూడా, నిధుల దుర్వినియోగం కింద, అభ్యంతర ఖర్చుల కింద ఎలా రాశారని అడగడంతో, సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయిన అధికారులు.* *కాకాణి మీడియాతో మాట్లాడుతూ..* – కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులపై కక్ష సాధింపులు ప్రారంభమయ్యాయి. – జిల్లాలో సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధుల స్థానాలను 95 శాతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల మద్దతుతో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులను తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవాలని కూటమి నేతలు బాహాటంగా వేధింపులకు పాల్పడుతున్నారు. – గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోకపోతే చెక్ పవర్ రద్దు చేయడం, తొలగిస్తామని సర్పంచ్ లను, స్థానిక ప్రజాప్రతినిధులను రకరకాల భయాందోళనలకు గురిచేస్తున్నారు. – స్థానిక సంస్థలలో ఎక్కువ శాతం మహిళలు ప్రాతినిధ్యం వహిస్తూ, అవమాన పాలవుతున్నారు. – బిల్లులు రాకపోయిన సొంత ఖర్చులతో పనులు చేస్తూ, చాలా మంది సర్పంచ్ లు అప్పులపాలవుతున్నారు. – రాజకీయ కక్షతో ప్రజా అవసరాల కోసం ఖర్చు చేసిన పనులకు బిల్లులు రాకుండా చేస్తున్నారు. – అధికారులు కూటమి నేతల కన్నుసన్నలలో మహిళా ప్రజా ప్రతినిధుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అవినీతిపరులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. – వెంకటాచలంలో సర్పంచ్ గా ఉన్న బీసీ మహిళను, వైకాపా నాయకుడు వెంకట శేషయ్యపై కక్షతో నిధులు దుర్వినియోగమయ్యాయని అభియోగం మోపి, విచారణ పేరుతో వేధిస్తున్నారు. – బిల్లులు, రుజువులు చూపిస్తే అధికారులు నీళ్లు నమిలే పరిస్థితులు ఏర్పడ్డాయి. – చదువుకున్న మహిళలు గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరితే, పొదలకూరు సర్పంచ్ గా ఎస్టీ మహిళ సర్పంచ్ గా పోటీ చేసేందుకు ముందుకు వచ్చింది. – ఎన్నో ఆశయాలతో గ్రామ అభివృద్ధి చేయాలని వచ్చిన చదువుకున్న సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయడం దౌర్భాగ్యం. – గతంలో పొదలకూరు సర్పంచ్ గా పనిచేసిన ఎస్సి మహిళను సైతం పార్టీ మారలేదని చెక్ పవర్ రద్దు చేశారు. – టిడిపి కండువా కప్పుకోకపోతే, చేసిన పనులకు బిల్లులు రావు, ఆస్తులు అమ్ముకొని గ్రామ అవసరాలు తీరుస్తున్న సర్పంచ్ లపై అవినీతిపరులుగా ముద్ర వేయడం దారుణం. – కూటమి నేతల అధికార భయంతో అధికారులకు నిజాయితీగా విచారణ చేసే ధైర్యం లేదు. – అధికార పార్టీ నేతలకు అధికారులు కొమ్ముకాస్తున్నారు. – కూటమి నేతల మాటలకు తలొగ్గి, విచారణ పూర్తి కాకమునుపే, షోకాజ్ నోటీసులో చెప్పిన సమయం గడవక ముందే, ఆఘమేఘాలపై చెక్ పవర్ రద్దు చేయవలసిన అవసరం అధికారులకు ఏముంది! – కూటమి నేతలు తమ మాట వినని అధికారులపై కూడా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. – గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అధికారులను సైతం ఇబ్బందులకు గురిచేస్తూ, వాళ్ళు చెప్పిందల్లా చేసే అధికారులను ఎంపిక చేసుకుంటున్నారు. – వీఐపీలు వస్తే ప్రోటోకాల్ పాటించాలని పెద్దల మెప్పు కోసం సర్పంచ్ లను పనులు చేయమన్న అధికారులు నేడు సర్పంచ్ లు ప్రొసీజర్ ఫాలో కావడం లేదని మాట్లాడటం హాస్యాస్పదం. – గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులకు అధ్యక్షత వహించాల్సిన సర్పంచ్ లను, స్థానిక ప్రజాప్రతినిధులను తగిన గౌరవం ఇవ్వకుండా, అవమానపరుస్తూ, అధికారులు యథేచ్ఛగా ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తున్నారు. – సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధులపై జరుగుతున్న వేధింపులపై న్యాయ పోరాటం చేస్తాం. – గతంలో సర్పంచ్ ను తొలిగించారని గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే, హై కోర్టు. ఆదేశాలను చూసి జిల్లా కలెక్టర్ రాజీనామా చేసేంతవరకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఏనాడు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపులకు పాల్పడలేదు. – ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ పార్టీకి చెందిన వారికైన గౌరవం ఇచ్చాము, వారిపట్ల హుందాగా నడుచుకున్నాం. – శాసనసభ్యులు చీప్ గా ఉంటే, పాలన ఎంత చీప్ గా ఉంటుందో సర్వేపల్లి నియోజకవర్గంలో చూస్తే అర్ధమవుతుంది. – అధికారం శాశ్వతం కాదని అధికారులు గుర్తించుకోవాలి. – అధికారులు చేసే పాపాలపై పునర్విచారణ చేపడుతాం, భవిష్యత్తులో మీకు అవి శాపాలుగా చుట్టుముట్టుతాయి. – అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం, దయదాక్షణ్యాల కోసం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, మూల్యం చెల్లించుకోకతప్పుదు. – కూటమి ప్రభుత్వంలో ఇంట్లో కూర్చున్నా కేసులు పెడుతున్నారు. – తమ ప్రమేయం లేకపోయినా సరే, సర్పంచ్ లపై, ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేస్తున్నారు. – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను తొలగించాలనే ఉద్దేశ్యంతో అవినీతిపరులుగా నిందలు మోపదం మనసును కలచివేస్తుంది. – రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వైనాట్ 175 ఖచ్చితంగా గెలిచి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు సర్పంచులుగా, ప్రజా ప్రతినిధులుగా ఉండటం అధికారులకు ఇష్టంలేకపోతే, అధికారులు స్పష్టం చెయ్యాలి, వారిచేత రాజీనామా చేయిస్తాం.. వారిని వేధింపులకు గురిచేయడం, అవినీతిపరులుగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదు. – అధికారుల తీరు మారకపోతే, జిలాల్లోని సర్పంచ్ లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అధికారుల పక్షపాత వైఖరిని నిరసిస్తూ, పోరాటం చేస్తాం.

*”సర్పంచ్ లపై నిందలు వద్దు” – కాకాణి*

*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:19-09-2025*

*నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలోని జిల్లా పంచాయతీ కార్యాలయానికి సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్లి, వారిపై జరుగుతున్న  వేధింపులు, ప్రోటోకాల్ ఉల్లంఘన, వివిధ అంశాలపై జిల్లా పంచాయతీ అధికారితో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*సర్పంచులకు జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిన షోకాజులకు వివరణ అడిగిన కాకాణి*

*కరెంట్ బిల్లులు చెల్లించినా, చెల్లించిన మొత్తం నిధులు దుర్వినియోగం అయ్యాయని రాయడానికి మీకు మనసు ఎలా వచ్చిందని నిలదీసిన కాకాణి.*

*కాకాణి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు.*

*మా పార్టీ సర్పంచులపై నిందలు వేయవద్దు, మేమే రాజీనామాలు చేస్తామని పేర్కొన్న కాకాణి.*

*జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సర్పంచులు అని కూడా చూడకుండా, దారుణమైన నిందలు వేస్తున్నారు.*

*సర్పంచులకు కనీసం మర్యాద ఇవ్వకుండా, ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూ, ఫిర్యాదులు చేస్తున్నా, జిల్లా అధికారులు మౌనవ్రతం పాటించడం సరికాదన్న కాకాణి.*

*మీడియా సమక్షంలోనే సర్పంచులు నిబంధనల మేర ఖర్చు చేసిన వాటికి కూడా, నిధుల దుర్వినియోగం కింద, అభ్యంతర ఖర్చుల కింద ఎలా రాశారని అడగడంతో, సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయిన అధికారులు.*

*కాకాణి మీడియాతో మాట్లాడుతూ..*

– కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులపై కక్ష సాధింపులు ప్రారంభమయ్యాయి.

– జిల్లాలో సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధుల స్థానాలను 95 శాతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల మద్దతుతో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులను తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవాలని కూటమి నేతలు బాహాటంగా వేధింపులకు పాల్పడుతున్నారు.

– గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోకపోతే చెక్ పవర్ రద్దు చేయడం, తొలగిస్తామని సర్పంచ్ లను, స్థానిక ప్రజాప్రతినిధులను రకరకాల భయాందోళనలకు గురిచేస్తున్నారు.

– స్థానిక సంస్థలలో ఎక్కువ శాతం మహిళలు ప్రాతినిధ్యం వహిస్తూ, అవమాన పాలవుతున్నారు.

– బిల్లులు రాకపోయిన సొంత ఖర్చులతో పనులు చేస్తూ, చాలా మంది సర్పంచ్ లు అప్పులపాలవుతున్నారు.

– రాజకీయ కక్షతో ప్రజా అవసరాల కోసం ఖర్చు చేసిన పనులకు బిల్లులు రాకుండా చేస్తున్నారు.

– అధికారులు కూటమి నేతల కన్నుసన్నలలో మహిళా ప్రజా ప్రతినిధుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అవినీతిపరులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

– వెంకటాచలంలో సర్పంచ్ గా ఉన్న బీసీ మహిళను, వైకాపా నాయకుడు వెంకట శేషయ్యపై కక్షతో నిధులు దుర్వినియోగమయ్యాయని అభియోగం మోపి, విచారణ పేరుతో వేధిస్తున్నారు.

– బిల్లులు, రుజువులు చూపిస్తే అధికారులు నీళ్లు నమిలే పరిస్థితులు ఏర్పడ్డాయి.

– చదువుకున్న మహిళలు గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరితే, పొదలకూరు సర్పంచ్ గా ఎస్టీ మహిళ సర్పంచ్ గా పోటీ చేసేందుకు ముందుకు వచ్చింది.

– ఎన్నో ఆశయాలతో గ్రామ అభివృద్ధి చేయాలని వచ్చిన చదువుకున్న సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయడం దౌర్భాగ్యం.

– గతంలో పొదలకూరు సర్పంచ్ గా పనిచేసిన ఎస్సి మహిళను సైతం పార్టీ మారలేదని చెక్ పవర్ రద్దు చేశారు.

– టిడిపి కండువా కప్పుకోకపోతే, చేసిన పనులకు బిల్లులు రావు, ఆస్తులు అమ్ముకొని గ్రామ అవసరాలు తీరుస్తున్న సర్పంచ్ లపై అవినీతిపరులుగా ముద్ర వేయడం దారుణం.

– కూటమి నేతల అధికార భయంతో అధికారులకు నిజాయితీగా విచారణ చేసే ధైర్యం లేదు.

– అధికార పార్టీ నేతలకు అధికారులు కొమ్ముకాస్తున్నారు.

– కూటమి నేతల మాటలకు తలొగ్గి, విచారణ పూర్తి కాకమునుపే, షోకాజ్ నోటీసులో చెప్పిన సమయం గడవక ముందే, ఆఘమేఘాలపై చెక్ పవర్ రద్దు చేయవలసిన అవసరం అధికారులకు ఏముంది!

– కూటమి నేతలు తమ మాట వినని అధికారులపై కూడా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు.

– గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అధికారులను సైతం ఇబ్బందులకు గురిచేస్తూ, వాళ్ళు చెప్పిందల్లా చేసే అధికారులను ఎంపిక చేసుకుంటున్నారు.

– వీఐపీలు వస్తే ప్రోటోకాల్ పాటించాలని పెద్దల మెప్పు కోసం సర్పంచ్ లను పనులు చేయమన్న అధికారులు నేడు సర్పంచ్ లు ప్రొసీజర్ ఫాలో కావడం లేదని మాట్లాడటం హాస్యాస్పదం.

– గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులకు అధ్యక్షత వహించాల్సిన సర్పంచ్ లను, స్థానిక ప్రజాప్రతినిధులను తగిన గౌరవం ఇవ్వకుండా, అవమానపరుస్తూ, అధికారులు యథేచ్ఛగా ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తున్నారు.

– సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధులపై జరుగుతున్న వేధింపులపై న్యాయ పోరాటం చేస్తాం.

– గతంలో సర్పంచ్ ను తొలిగించారని గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే, హై కోర్టు. ఆదేశాలను చూసి జిల్లా కలెక్టర్ రాజీనామా చేసేంతవరకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఏనాడు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపులకు పాల్పడలేదు.

– ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ పార్టీకి చెందిన వారికైన గౌరవం ఇచ్చాము, వారిపట్ల హుందాగా నడుచుకున్నాం.

– శాసనసభ్యులు చీప్ గా ఉంటే, పాలన ఎంత చీప్ గా ఉంటుందో సర్వేపల్లి నియోజకవర్గంలో చూస్తే అర్ధమవుతుంది.

– అధికారం శాశ్వతం కాదని అధికారులు గుర్తించుకోవాలి.

– అధికారులు చేసే పాపాలపై పునర్విచారణ చేపడుతాం, భవిష్యత్తులో మీకు అవి శాపాలుగా చుట్టుముట్టుతాయి.

– అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం, దయదాక్షణ్యాల కోసం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, మూల్యం చెల్లించుకోకతప్పుదు.

– కూటమి ప్రభుత్వంలో ఇంట్లో కూర్చున్నా కేసులు పెడుతున్నారు.

– తమ ప్రమేయం లేకపోయినా సరే, సర్పంచ్ లపై, ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేస్తున్నారు.

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను తొలగించాలనే ఉద్దేశ్యంతో అవినీతిపరులుగా నిందలు మోపదం మనసును కలచివేస్తుంది.

– రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వైనాట్ 175 ఖచ్చితంగా గెలిచి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు సర్పంచులుగా, ప్రజా ప్రతినిధులుగా ఉండటం అధికారులకు ఇష్టంలేకపోతే, అధికారులు స్పష్టం చెయ్యాలి, వారిచేత రాజీనామా చేయిస్తాం.. వారిని వేధింపులకు గురిచేయడం, అవినీతిపరులుగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదు.

– అధికారుల తీరు మారకపోతే, జిలాల్లోని సర్పంచ్ లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అధికారుల పక్షపాత వైఖరిని నిరసిస్తూ, పోరాటం చేస్తాం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.