ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతి నిధి)
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఖమ్మం నగరం నిర్మానుషంగా మారింది. పండుగ కోసం ప్రజలు పెద్ద ఎత్తున సొంత ఊర్లకు వెళ్లడం, విద్యా సంస్థలకు సెలవులు రావడంతో సోమవారం నుంచే ఖమ్మంలోని ప్రధాన రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ట్రాఫిక్‌తో కిటకిటలాడే ప్రాంతాలు ఇప్పుడు నిశ్శబ్దంగా మారాయి.
అయితే నగర రహదారులు ఖాళీగా ఉన్నప్పటికీ, ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ మాత్రం భారీగా కొనసాగుతోంది. పండుగ ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు.
సంక్రాంతి సమయంలో తెలంగాణలో ముందుగా ఖాళీ అయ్యే నగరంగా హైదరాబాద్ ఉంటే, రెండవ స్థానంలో ఖమ్మం నిలుస్తుందని చెప్పుకోవచ్చు.

