Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

శ్రీవారి సేవలో పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం : 15 టన్నుల కూరగాయలు వితరణ

శ్రీవారి సేవలో పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం : 15 టన్నుల కూరగాయలు వితరణ

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తులకు నిత్య అన్నప్రసాద వితరణకు పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం ఉదారత చాటుకుంది. సంఘం ఆధ్వర్యంలో సుమారు 15 టన్నుల కూరగాయలను టీటీడీ అన్నప్రసాద విభాగానికి విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా బలిజ సంఘం నాయకులు మాట్లాడుతూ.. “శ్రీవారి అన్నదాన సేవలో పలమనేరు బలిజ అభ్యుదయ సేవ సంఘం తరపున భాగస్వాములు కావడం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని వారు వెల్లడించారు. స్వామివారి భక్తులకు సేవ చేయడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు. కూరగాయలు వితరణలో తమ వంతు సాయం అందించిన బలిజ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ కూరగాయలు ప్రతినిధులు అందజేసిన సంఘం సభ్యులను అభినందించి, సన్మానించి వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. భక్తిశ్రద్ధలతో వాహనాన్ని ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించి, సంఘ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుమలకు పంపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం నాయకులు సుధాకర్, పిజెసి బాబు, రూపేష్, అరుణ్ కుమార్, సుదర్శన్ బాలాజీ, కోటీశ్వరులు, శివకుమార్, మంజునాథ్, అమ్ములు, గణేష్, లక్ష్మీపతి, జయశంకర్, సోమశేఖర్, పుష్పాలు వెంకటేశ్వర్లు, చిట్టి, శంకరప్ప , సుబ్రహ్మణ్యం, నరసింహులు, గోవర్ధన్, ప్రేమ్, దేవా, సుబ్బు, భాస్కర్,చంద్ర, జగ్గా, శ్రీధర్, ఆనంద, రెడ్డప్ప, రమణ, వేణు లతోపాటు బలిజ సంఘం సభ్యులు మరియు టీటీడీ కూరగాయలు ప్రతినిధులు రవీంద్ర రెడ్డి, కిషోర్ స్వామి, భరద్వాజ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *