Tuesday, 7 April 2026
  • Home  
  • వైభవంగా శ్రీరాములు పట్టాభిషేకం కన్నుల పండుగగా శ్రీ సీతారాముల గ్రామోత్సవం
- తిరుపతి

వైభవంగా శ్రీరాములు పట్టాభిషేకం కన్నుల పండుగగా శ్రీ సీతారాముల గ్రామోత్సవం

పున్నమి ప్రతినిధి, రామచంద్రాపురం రామచంద్రపురం మండలం సికె పల్లి పంచాయతీ చిట్టత్తూరు గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు 11 రోజులు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరామ నవమి నుంచి ప్రతిరోజు ఒక పురవీధికి సంబంధించిన గ్రామస్తులు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజు సోమవారం శ్రీరాములు వారికి పట్టాభిషేకం, శ్రీ సీతారాముల దేవరులకు గ్రామోత్సవం గ్రామంలోని యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వసంతోత్సవం కార్యక్రమం నిర్వహించి గ్రామ వీధుల్లో స్వామివారిలను ఊరేగించారు. రాత్రి స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించి, దేవదేవేర్లను గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం చేశారు. శ్రీ సీతారాములు ఊరేగింపుగా పురవీధులలో చెక్కభజనలు, భజన కార్యక్రమాలతో భక్తులను కటాక్షించారు. ఇంటి ముందరికి వచ్చిన శ్రీ సీతారాములకు మహిళలు కర్పూర హారతులు ఇచ్చి నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. శ్రీరామనామం స్మరణ తో పిల్లలు పెద్దలు మహిళలు ఆనంద పరవశమయ్యారు. ఉభయ దాతలుగా తూకువాకం భాను కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. భక్తులందరికీ అన్నదాన వితరణ చేశారు.

పున్నమి ప్రతినిధి, రామచంద్రాపురం

రామచంద్రపురం మండలం సికె పల్లి పంచాయతీ చిట్టత్తూరు గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు 11 రోజులు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరామ నవమి నుంచి ప్రతిరోజు ఒక పురవీధికి సంబంధించిన గ్రామస్తులు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజు సోమవారం శ్రీరాములు వారికి పట్టాభిషేకం, శ్రీ సీతారాముల దేవరులకు గ్రామోత్సవం గ్రామంలోని యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వసంతోత్సవం కార్యక్రమం నిర్వహించి గ్రామ వీధుల్లో స్వామివారిలను ఊరేగించారు. రాత్రి స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించి, దేవదేవేర్లను గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం చేశారు. శ్రీ సీతారాములు ఊరేగింపుగా పురవీధులలో చెక్కభజనలు, భజన కార్యక్రమాలతో భక్తులను కటాక్షించారు. ఇంటి ముందరికి వచ్చిన శ్రీ సీతారాములకు మహిళలు కర్పూర హారతులు ఇచ్చి నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. శ్రీరామనామం స్మరణ తో పిల్లలు పెద్దలు మహిళలు ఆనంద పరవశమయ్యారు. ఉభయ దాతలుగా తూకువాకం భాను కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. భక్తులందరికీ అన్నదాన వితరణ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.