విశాఖ హ్యూమర్ క్లబ్ తమ
రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం పౌర గ్రంథాలయంలో నిర్వహించిన కామెడీ కుంభమేళ నవ్వుల పంట పండించింది. నిర్వాహకులు రావి గోపి కృష్ణ, ఎస్ ఎస్ రామానుజo, భాను ప్రకాష్, శ్రీపాద చిదంబరం శివజ్యోతి, సూర్యం, ఆర్ ఎస్ ఎన్ మూర్తి, శ్రీనివాస్, గణేష్, జీవిలక్ష్మి తదితరులు ప్రదర్శించిన హాస్య లఘు నాటికలు కడుపుబ్బా నవ్వించాయి. కార్యక్రమంలో నటుడు రాపేటి అప్పారావు, కళా రంగ ప్రముఖులు సన్ మూర్తి, దాడి సత్యనారాయణ, కొరిటాల ప్రభాకర్ తదితరులు హాస్య కళాకారులను అభినందించారు. ‘నవ్వడం ఒక యోగం- నవ్వించడం ఒక భోగం- నవ్వకపోవడం ఒక రోగం’ అనే చలోక్తిని వినిపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఈ వార్షికోత్సవ వేడుకలలో ప్రముఖ వైద్యులు శ్రీరామ్ మూర్తి పలు సినీ గీతాలను ఆలపించి అలరించారు. కామిడీ స్కిట్స
టెలిగ్రామ్, నా హృదయం కొట్టేశారు, బంపర్ ప్రైజ్, కిడ్నీలో రాళ్లు, నవ్వులు పువ్వులు, టైమ్ ఎంత, ప్రియురాలికి ప్రేమలేఖ వంటి హాస్య సన్నివేశాలను ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆహుతులు హాజరై కరతాల ధ్వనులతో కళాకారులను అనుక్షణం అభినందించారు . తిలక్, మూర్తి, విజయనగరం ఫోటో శ్రీనివాస్, మస్తాన్ రెడ్డి, ఈ మండీ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

విశాఖ హ్యూమర్ క్లబ్ నవ్వుల పంట
విశాఖ హ్యూమర్ క్లబ్ తమ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం పౌర గ్రంథాలయంలో నిర్వహించిన కామెడీ కుంభమేళ నవ్వుల పంట పండించింది. నిర్వాహకులు రావి గోపి కృష్ణ, ఎస్ ఎస్ రామానుజo, భాను ప్రకాష్, శ్రీపాద చిదంబరం శివజ్యోతి, సూర్యం, ఆర్ ఎస్ ఎన్ మూర్తి, శ్రీనివాస్, గణేష్, జీవిలక్ష్మి తదితరులు ప్రదర్శించిన హాస్య లఘు నాటికలు కడుపుబ్బా నవ్వించాయి. కార్యక్రమంలో నటుడు రాపేటి అప్పారావు, కళా రంగ ప్రముఖులు సన్ మూర్తి, దాడి సత్యనారాయణ, కొరిటాల ప్రభాకర్ తదితరులు హాస్య కళాకారులను అభినందించారు. ‘నవ్వడం ఒక యోగం- నవ్వించడం ఒక భోగం- నవ్వకపోవడం ఒక రోగం’ అనే చలోక్తిని వినిపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఈ వార్షికోత్సవ వేడుకలలో ప్రముఖ వైద్యులు శ్రీరామ్ మూర్తి పలు సినీ గీతాలను ఆలపించి అలరించారు. కామిడీ స్కిట్స టెలిగ్రామ్, నా హృదయం కొట్టేశారు, బంపర్ ప్రైజ్, కిడ్నీలో రాళ్లు, నవ్వులు పువ్వులు, టైమ్ ఎంత, ప్రియురాలికి ప్రేమలేఖ వంటి హాస్య సన్నివేశాలను ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆహుతులు హాజరై కరతాల ధ్వనులతో కళాకారులను అనుక్షణం అభినందించారు . తిలక్, మూర్తి, విజయనగరం ఫోటో శ్రీనివాస్, మస్తాన్ రెడ్డి, ఈ మండీ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

