నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన జాదవ్ అక్షర S/o హనుమంత్ రావు గారు BDS కోర్సులో సీటు సాధించడం గ్రామానికి ఆనందాన్ని కలిగించింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని AMEWA (Are Marata Employee Association) సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో AMEWA మెంబెర్స్, స్థానిక ప్రజలు, స్నేహితులు, బంధువులు పాల్గొని అక్షర ప్రతిభను ప్రశంసించారు. చిన్న వయస్సులోనే ఉన్నత విద్యలో అడుగుపెట్టిన అక్షర, భవిష్యత్తులో వైద్య రంగంలో మంచి సేవలు అందిస్తుందని అందరూ నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ –
“గ్రామంలోని యువతకు అక్షర విజయమే ప్రేరణ” అని అభినందించారు.
“ఇలాంటి ప్రతిభావంతుల ద్వారా గ్రామానికి పేరుప్రతిష్ఠలు వస్తాయి” అని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.
అమేవ ప్రతినిధులు మాట్లాడుతూ –
“అక్షర మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మా ఆకాంక్ష. విద్యారంగంలో నిలదొక్కుకొని, సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.
కార్యక్రమం అనంతరం అక్షరను పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.


